• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2024లో బిగ్ స్క్రీన్ మీద...

2024లో బిగ్ స్క్రీన్ మీద కనిపించని హీరోయిన్లు వీరే!

| కొత్త ఏడాదిలో అలరించడానికి రెడీ అవుతున్న ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

By - Tupaki Desk
Update: 2024-12-21 10:30 GMT

ఏటా తమ అందచందాలతో సినీ ప్రియులను అలరించే పలువురు హీరోయిన్లు.. 2024లో బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. చేతి నిండా ప్రాజెక్ట్స్ తో ఏడాది పొడవునా బిజీగా ఉన్నప్పటికీ, అనుకున్న విధంగా సినిమాలు విడుదల అవ్వకపోవడంతో ఈ సంవత్సరం సందడి చేయలేకపోయారు. అయితే ఈసారి తెరపై కనిపించకపోయినా, 2025లో మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నారు. కొత్త ఏడాదిలో అలరించడానికి రెడీ అవుతున్న ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

గతేడాది చివర్లో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో హిట్టు కొట్టిన సౌత్ క్వీన్ అనుష్క శెట్టి.. ఈ ఏడాది 'ఘాటీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నించింది. కానీ కుదరలేదు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా వచ్చే సమ్మర్ లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు స్వీటీ మలయాళ డెబ్యూ మూవీ 'కథనార్: ది వైల్డ్ సోర్సెరర్' కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది.

2023లో 'శాకుంతలం', 'ఖుషి' సినిమాలతో సందడి చేసిన అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు.. ఈ ఇయర్ లో బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. కాకపోతే ఇటీవల 'సిటాడెల్: హనీబన్నీ' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో అలరించింది. ఆ మధ్య తన సొంత ప్రొడక్షన్ లో 'మా ఇంటి బంగారం' అనే సినిమాని ప్రకటించింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. కానీ ఈ మూవీ వచ్చే సంవత్సరం విడుదల అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి', 'సలార్ పార్ట్-1' వంటి మూడు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న శృతి హాసన్.. ఈ ఏడాది సైలెంట్ అయిపోయింది. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం 'కూలీ' సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 'సలార్ 2' కూడా లైనప్ లో ఉంది కానీ, అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది తెలియడం లేదు. గ్యాప్ లేకుండా సినిమాలు చేసే నయనతారకు కూడా ఈ ఇయర్ లో గ్యాప్ వచ్చింది. కానీ వచ్చే ఏడాది మాత్రం దాదాపు 8 ప్రాజెక్ట్స్ తో రాబోతోంది. కాకపోతే వీటిల్లో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా లేదు.

అందాల భామ నిధి అగర్వాల్ తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు దాటింది. ఇప్పుడు 'హరి హర వీరమల్లు', 'ది రాజాసాబ్' వంటి రెండు పాన్ ఇండియా సినిమాల మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఇవి రెండూ వచ్చే వేసవిలో విడుదల కాబోతున్నాయి. 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే.. తెలుగు సినిమా చేసి రెండేళ్లు దాటిపోయింది. ఈ ఏడాది ఆమె నటించిన సినిమా లేకుండానే గడిచిపోయింది. అయితే ప్రస్తుతం అమ్మడు 'సూర్య 44', 'దలపతి 69', 'దేవా'తో సహా నాలుగు చిత్రాలు చేస్తోంది.

'భోళా శంకర్' తర్వాత తెలుగు తెరకు దూరమైన మిల్కీ బ్యూటీ తమన్నా.. వచ్చే ఏడాది 'ఓదెల 2' చిత్రంతో పలకరించనుంది. రెండేళ్ల క్రితం ఆడియన్స్ కు 'థ్యాంక్యూ' చెప్పిన రాశీ ఖన్నా.. సమ్మర్ లో 'తెలుసు కదా' అంటూ రాబోతోంది. దీంతో పాటుగా ఆమె చేతిలో రెండు తమిళ, హిందీ చిత్రాలు ఉన్నాయి. 'ది గోట్' స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరిసిన త్రిష కృష్ణన్.. నెక్స్ట్ ఇయర్ హాఫ్ డజన్ సినిమాతో రానుంది. వాటిల్లో 'విశ్వంభర' లాంటి తెలుగు ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇలా అనేక మంది ముద్దుగుమ్మలు 2025లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి వీరిలో ఎవరెవరికి విజయాలు వరిస్తాయో చూడాలి.

Tags:    
  • Lookbackentertainment 
  • Tollywood 
  • Kollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • SouthIndianActress 
  • Anushkashetty 
  • Ghaati 
  • Samantharuthprabhu 
  • MaaIntiBangaram 
  • Shrutihaasan 
  • Salaar2 
  • Coolie 
  • Niddhiagerwal 
  • TheRajasaab 
  • Tamannabhatia 
  • Odela2 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS