• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ గందరగోళం ఎందుకు...

ఈ గందరగోళం ఎందుకు లోకేష..?

| ఇంతకు రజినీకాంత్‌ సినిమా టైటిల్ నే రేపు ప్రకటించబోతున్నాడా లేదంటే లోకేష తన నిర్మాణంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన టైటిల్‌ ను రేపు ప్రకటించబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

By - Tupaki Desk
Update: 2024-04-13 14:30 GMT

ఖైదీ, విక్రమ్‌, లియో తో పాటు ఇంకా పలు సినిమాలతో తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో స్టార్‌ దర్శకుడిగా పేరు దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమా రజినీకాంత్‌ తో అనే విషయం ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. లియో సినిమా విషయంలో జరిగిన తప్పు పునరావృతం కాకుండా లోకేష్ కనగరాజ్ జాగ్రత్త పడుతున్నాడట.

ఖైదీ మరియు విక్రమ్‌ సినిమాలకు సీక్వెల్స్ చేయాల్సి ఉన్నా కూడా రజినీకాంత్‌ తో లోకేష్ సినిమా మొదలు పెట్టాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చింది. రజినీకాంత్‌ ఇమేజ్ కు తగ్గట్లుగా అద్భుతమైన కథ రెడీ అయ్యిందని ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు.

రజినీకాంత్‌ తో రూపొందబోతున్న సినిమా టైటిల్‌ తో పాటు మరిన్ని విషయాలను ఏప్రిల్‌ 22న వెళ్లడించబోతున్నట్టు ఆ మధ్య దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించాడు. ఆ తేదీ కోసం ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా రేపు అంటే ఏప్రిల్‌ 14న తన సినిమా టైటిల్‌ ను ప్రకటించబోతున్నట్లు పేర్కొన్నాడు.

రజినీకాంత్‌ తో చేయబోతున్న సినిమా టైటిల్‌ ను ఏప్రిల్‌ 22న ప్రకటించబోతున్నట్లుగా చెప్పిన లోకేష్ ఇప్పుడు రేపు టైటిల్‌ ను ప్రకటించబోతున్నట్లుగా చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ మరియు మీడియా వర్గాల వారు అంతా కూడా అవాక్కవుతున్నారు.

ఇంతకు రజినీకాంత్‌ సినిమా టైటిల్ నే రేపు ప్రకటించబోతున్నాడా లేదంటే లోకేష తన నిర్మాణంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన టైటిల్‌ ను రేపు ప్రకటించబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. రేపు ఈ విషయమై లోకేష్ నుంచి వచ్చే ప్రకటనతో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రజినీకాంత్‌ తో సినిమాను చేయబోతున్న లోకేష్ కనగరాజ్‌ తన శిష్యుడి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించాడు. కనుక రేపు రాబోతున్న ప్రకటన, టైటిల్‌ ఏ సినిమాది అనేది సస్పెన్స్ గా మారింది. ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో నెటిజన్స్ పలువురు ఇంత గందరగోళం ఎందుకు లోకేష్‌ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    
  • Lokeshkangaraj 
  • Superstar 
  • Rajinikanth 
  • Movietitle 
  • Leo 
  • Vikram 
  • Khaidi 
  • Kollywood 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS