• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒంటి చేయితో...

ఒంటి చేయితో కనిపించబోతున్న స్టార్‌ హీరో?

| నవల కథ విషయానికి వస్తే.. హీరో ఒక ప్రమాదం లో చేయి పోగొట్టుకుంటాడు. దాంతో అతడు స్టీల్‌ చేయిని వాడుతూ ఉంటాడు

By - Tupaki Desk
Update: 2023-09-04 07:15 GMT

తమిళ్ స్టార్‌ హీరో సూర్య కొత్త సినిమాకు కమిట్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా రూపొందబోతోంది అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ సినిమా ఏంటి.. ఎప్పుడు ఉంటుంది అనే విషయం లో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

లోకేష్ కనగరాజ్ కెరీర్‌ ఆరంభం లో ది స్టీల్ క్లాని నవల ఆధారంగా ఒక కథ ను రాసుకున్నాడట. ఆ కథ ను అప్పట్లో చాలా మంది నిర్మాతలు రిజక్ట్‌ చేశారు. కొత్త హీరోలు, సీనియర్ హీరోలు ఏ ఒక్కరు కూడా ఆ కథ విషయంలో ఆసక్తి చూపించలేదట. దాంతో ఆ నవల కథ ను దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇన్నాళ్లు పక్కకు పెట్టాడు. మళ్లీ ఇప్పుడు ఆ కథ కు బూజు దులిపి నట్టుగా తెలుస్తోంది.

సూర్య తో ఆ కథ ను చేసేందుకు దర్శకుడు సిద్ధం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సూర్య ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్‌ ల ను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమాను చేయబోతున్నాడు. ఇక లోకేష్‌ కనగరాజ్ కూడా చాలా బిజీగా ఉన్నాడు. ఆయన ప్రస్తుతానికి విజయ్ సినిమా పనిలో ఉన్న విషయం తెల్సిందే.

నవల కథ విషయానికి వస్తే.. హీరో ఒక ప్రమాదం లో చేయి పోగొట్టుకుంటాడు. దాంతో అతడు స్టీల్‌ చేయిని వాడుతూ ఉంటాడు. అతడి జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అనూహ్యంగా మరో ప్రమాదానికి గురి అవుతాడు. ఆ ప్రమాదం వల్ల అతీత శక్తులు వస్తాయి. కథలో అప్పటి నుండి మంచి మలుపులు ఉంటాయి.

అతడికి వచ్చిన శక్తులతో శరీరం మొత్తం మాయం అవుతుంది. కానీ అతడికి పోయిన చేయి మాత్రం కనిపిస్తుంది. హీరో తనకు వచ్చిన అతీత శక్తులతో ఏం చేశాడు అనేది సినిమా కథ గా సాగుతుంది. సోషియో ఫాంటసీ నేపథ్యం తో పాటు మంచి స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని దర్శకుడు లోకేష్ మలిస్తే సూర్యకు కెరీర్‌ బెస్ట్‌ మూవీ పడే అవకాశం ఉందని తమిళ మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.

Tags:    
  • Lokeshkanagaraj 
  • Suriya 
  • Filmindustry 
  • Thesteelclannovel 
  • Lokesh 
  • Tamilfilmindustry 
  • Tamilstarhero 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS