• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి కలెక్షన్ల మోత… నారా...

కల్కి కలెక్షన్ల మోత… నారా లోకేష్ ఏమన్నారంటే

| ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల నుంచి మొదలు పెడితే ఈ రోజు మేగ్జిమమ్ థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి.

By - Tupaki Desk
Update: 2024-06-27 09:29 GMT

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన విజువల్ స్పెక్టక్యులర్ మూవీ కల్కి 2898ఏడీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చింది. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల నుంచి మొదలు పెడితే ఈ రోజు మేగ్జిమమ్ థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ లో కల్కి సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది.

మూవీ చూసిన అందరూ బాగుందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో మెజారిటీ వర్గం నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. క్రిటిక్స్ సైతం నాగ్ అశ్విన్ మేకింగ్, విజువలైజేషన్ పరంగా మంచి మార్కులు ఇస్తున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో కల్కి 2898ఏడీ సినిమాని నాగ్ అశ్విన్ ఆవిష్కరించాడనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. మౌత్ టాక్ జనాల్లోకి గట్టిగానే వెళ్తోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఓవర్సీస్ లో ప్రీమియర్ షోకి రికార్డ్ స్థాయిలో 3.7 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు. ఇండియన్ బాక్సాఫీస్ పై ఇప్పటి వరకు ఏ చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్స్ రాలేదని అంటున్నారు. ఇదిలా ఉంటే కల్కి మూవీపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు. కల్కి2898ఏడీ రివ్యూ చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని నారా లోకేష్ తెలిపారు.

అలాగే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, ఇలా అందరికి అభినందనలు తెలియజేశారు. వరల్డ్ క్లాస్ ఇండియన్ సినిమాని అందించిన నాగ్ అశ్విన్ కి లోకేష్ అభినందనలు తెలిపారు. అలాగే సినిమాని ఇంత గ్రాండ్ స్కేల్ పై నిర్మించిన అశ్వినీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. గ్లోబల్ లెవల్ కి ఇండియన్ సినిమాని తీసుకెళ్ళినందుకు చాలా గర్వంగా ఉందని ట్విట్టర్ లో నారా లోకేష్ పేర్కొన్నారు.

ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే వరల్డ్ వైడ్ గా కల్కి 2898ఏడీ మూవీ 200+ కోట్లు మొదటి రోజు కలెక్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కల్కి 2898ఏడీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. సినీ ప్రముఖులు సైతం కల్కి మూవీపై ప్రశంసలు కురిపిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు.

Really happy to hear terrific reviews for #Kalki2898AD. I congratulate #Prabhas Garu, @SrBachchan Garu, @ikamalhaasan Garu, @deepikapadukone Garu and Director @nagashwin7 Garu for redefining Indian Cinema with this masterpiece. Special praise must be reserved for @AshwiniDuttCh… pic.twitter.com/O3E92GcPIZ

— Lokesh Nara (@naralokesh) June 27, 2024
Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Ycp 
  • NaraLokesh 
  • Chandrababu 
  • SocialMedia 
  • Kalki2898ad 
  • KalkiTeam 
  • Prabhas 
  • Nagashwin 
  • AshwiniDutt 
  • Amitabhbachchan 
  • Dishapatani 
  • Kamalhaasan 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS