లోకేష్.. సంక్లిష్ట స్థితి దాటాల్సిందే..?

లోకేష్ కనకరాజ్ డైరెక్టోరియల్ మూవీస్ అనగానే ఆడియన్స్ అంతా అదేదో పూనకాలు వచ్చిన వారిలా ఊగిపోతుంటారు.;

Update: 2025-08-20 04:34 GMT

లోకేష్ కనకరాజ్ డైరెక్టోరియల్ మూవీస్ అనగానే ఆడియన్స్ అంతా అదేదో పూనకాలు వచ్చిన వారిలా ఊగిపోతుంటారు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయన అంత వైబ్రేషన్స్ తెచ్చాడు. తప్పేం లేదు ఖైదీ, విక్రం సినిమాలు చూస్తే ఆయన ఈ క్రేజ్ కు అర్హుడనే భావన వస్తుంది. ఐతే ఎప్పుడైతే అంచనాలు పెరుగుతాయో అప్పుడు అసలు స్టోరీ మొదలవుతుంది. కూలీ కాదు లియో టైం లోనే లోకేష్ డిజప్పాయింట్ చేశాడు. ఆ సినిమాకు ముందున్న బజ్ వేరు సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన వసూళ్లు వేరు.

లోకేష్ డైరెక్టర్ గా ఫెయిల్..

ఎల్.సి.యు అంటూ లోకేష్ సినిమాలకు లేనిపోని క్రేజ్ తెచ్చి అతని క్రేజే అతని సినిమాకు అడ్డుగా మారేలా చేస్తున్నారు. ఐతే కూలీ సినిమా రజనీ, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఇంత స్టార్ కాస్ట్ ఉన్నా కూడా లోకేష్ డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు. సినిమాలో కొన్ని మెరుపులు మాత్రమే ఆ ఇది లోకేష్ సినిమా అనేలా ఉన్నాయి తప్ప మిగతాది ఏమి లేదు.

ఐతే లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ ఖైదీ 2 చేస్తాడని అనుకుంటే దానికన్నా ముందు మరో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. విక్రం లాంటి హిట్ ఇచ్చిన కమల్ తో లోకేష్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడట. ఇక్కడ మరో క్రేజీ థింగ్ ఏంటంటే ఆ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉంటారట. రజనీ, కమల్ ఇద్దరినీ కలిపి లోకేష్ సినిమా తీయాలని అనుకుంటున్నాడు.

ఇమేజ్ కి తగిన స్కోప్ ఇవ్వాలి..

ఇది చాలా పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. హేమాహేమీలే ఈ ఇద్దరినీ ఒక సినిమాలో పెట్టడానికి ముందుకు రాలేదు. కెరీర్ మొదట్లో ఇద్దరు కలిసి నటించినా కూడా ఎవరికి వారు సూపర్ స్టార్స్ గా మారాక అది జరగలేదు. ఐతే లోకేష్ మాత్రం ఈ ఇద్దరితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఐతే స్టార్స్ ని పెట్టుకోవడం వరకు ఓకే కానీ వాళ్ల ఇమేజ్ కి తగిన స్కోప్ ఇవ్వాలి. కూలీ చూశాక లోకేష్ డైరెక్షన్ మీద అనుమానం వచ్చేలా చేసుకున్నాడు.

మరి రజనీ, కమల్ సినిమా అయినా ఇద్దరిని సరిగా వాడుకుంటాడా లేదా అన్నది డిస్కషన్ జరుగుతుంది. లోకేష్ మాత్రం ఈసారి తన ఒరిజినల్ టాలెంట్ ఏంటో చూపిస్తా అని అంటున్నాడు. సో ఈ ప్రాజెక్ట్ ముందుకొస్తే మాత్రం కార్తితో తీయాల్సిన ఖైదీ 2 వెనక్కి వెళ్లినట్టే లెక్క. మరి లోకేష్ ఏం ఆలోచిస్తున్నాడో కానీ అతని ఫ్యాన్స్ మాత్రం కూలీ లో మిస్సైన ఫైర్ ని తన నెక్స్ట్ సినిమాలో చూడాలని ఫిక్స్ అయ్యారు.

Tags:    

Similar News