లోకేష్ కన్నా నెల్సన్ ఒక మెట్టు ఎక్కేశాడు..!
మిగతా విషయాలన్నీ అటుంచితే అదేంటో దేవా పాత్రలో రజనీని కూడా లోకేష్ సరిగా చూపించలేకపోయాడన్నది వాస్తవమని చెప్పొచ్చు.;
కూలీ సినిమా చూసిన ఆడియన్స్ ఫ్యాన్స్ అంతా ఓకే కానీ లోకేష్ కనకరాజ్ సినిమాలు ఇష్టపడే ఫ్యాన్స్ మాత్రం కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. కూలీ అంటూ లోకేష్ సినిమా మొదలైన నాటి నుంచి ఒకటే హంగామా. సినిమాతో కోలీవుడ్ కి 1000 కోట్లు తెచ్చేస్తాడని ఊదరగొట్టారు. కూలీ సినిమాలో రజనీ ఒక్కడే కాదు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ అబ్బో ఇంకే సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అనుకున్నారు. కానీ సినిమా చూస్తే తెలిసింది ఏంటంటే లోకేష్ చాలా పేలవమైన స్క్రీన్ ప్లేతో సినిమా నడిపించడం వల్ల ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు.
రజనీకాంత్ స్క్రీన్ మీద అలా నడిచి వస్తేనే..
మిగతా విషయాలన్నీ అటుంచితే అదేంటో దేవా పాత్రలో రజనీని కూడా లోకేష్ సరిగా చూపించలేకపోయాడన్నది వాస్తవమని చెప్పొచ్చు. లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరడం కూడా ఇందుకు ప్రధాన కారణం. రజనీకాంత్ జస్ట్ స్క్రీన్ మీద అలా నడిచి వస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఆయన స్టైల్, స్వాగ్ ఇలా ప్రతీదీ ఫెస్టివల్ మూడ్ అనిపిస్తాయి. కానీ లోకేష్ కూలీలో రజనీని కూడా సరిగా వాడుకోలేదు.
లోకేష్ కన్నా జైలర్ సినిమాలో నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ ని బాగా చూపించాడు. స్క్రీన్ పై రజనీ ఆరా ఒక రేంజ్ లో ఉంటుంది. దానికి బలమైన సీన్స్, ఎమోషన్, యాక్షన్ కుదిరితే అదిరిపోతుంది. జైలర్ సినిమాలో నెల్సన్ అలానే రాసుకున్నాడు. అందుకే ఆ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది. అదీగాక నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ మీద పెద్దగా అంచనాలు లేవు. అది కూడా జైలర్ సక్సెస్ కి ఒక రీజన్ అని చెప్పొచ్చు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్.సి.యు)లో..
కానీ లోకేష్ తో రజనీ సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్.సి.యు)లో భాగం కాదు మొర్రో అని లోకేష్ చెప్పినా కూడా ఆడియన్స్ లేదు ఇది కచ్చితంగా ఎల్.సి.యు లో భాగనే అంటూ కూలీ పై అనవసరమైన బజ్ పెంచారు. అవన్నీ కలిసి సినిమాను నిరాశపరచేలా చేశాయి.
కూలీ ఒక మోస్తారుగా బాగుంది. కానీ లోకేష్ కనకరాజ్, రజనీ కాంబో సినిమాపై ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేదు. ఐతే జైలర్ లో రజనీని చూపించిన రేంజ్ కన్నా లోకేష్ రజనీని చాలా తక్కువ చూపించడం మాత్రం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది. నెల్సన్ జైలర్ సినిమాలో కూడా రజనీకి సపోర్ట్ గా స్టార్ క్యామియోస్ వాడాడు. అవి కూడా జైలర్ లో సూపర్ గా వర్క్ అవుట్ అయ్యాయి. లోకేష్ కూలీలో కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. కానీ కూలీలో అవి కూడా వర్క్ అవుట్ కాలేదు. కూలీ లోకేష్, జైలర్ నెల్సన్ లను దగ్గర చూస్తే ఈ సినిమా వరకు నెల్సన్ గెలిచాడనే చెప్పొచ్చు.