• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లోకేష్ DISCO ప్లాన్...

లోకేష్ DISCO ప్లాన్ ఏంటబ్బా?

| కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-09-01 20:30 GMT

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. మా నగరం మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్.. తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఖైదీ, మాస్టర్, లియో, విక్రమ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో పాన్ ఇండియా ఆడియన్స్ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తన టాలెంట్ తో అందరినీ ఫిదా చేసేశారు.

ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఆ సినిమా టైటిల్ రివీల్ టీజర్ కు మ్యాసీవ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆడియన్స్ లో సినిమాపై వేరే లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ కూడా వాటిని ఇంకా పెంచుతూ ఒక్కో అప్డేట్ రివీల్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ ను రంగంలోకి దింపుతున్నారు. అయితే టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ లో డిస్కో (DISCO) అనే పదాన్ని మేకర్స్ ఎక్కువగా హైలెట్ చేశారు.

దానికి వెనుక లోకేష్ పెద్ద ప్లాన్ ఉన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. DISCO పదంలోని అక్షరాలకు సంబంధించి ఒక్కో పాత్రను మేకర్స్ రివీల్ చేస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు. అందుకు ఉదాహరణను కూడా నెట్టింట వివరిస్తున్నారు. కూలి మేకర్స్ ఇటీవలే.. మాలీవుడ్ స్టార్ యాక్టర్ సౌబిన్ సౌహిర్ ను దయాల్ గా, టాలీవుడ్ కింగ్ నాగార్జునను సైమన్ గా పరిచయం చేసిన విషయం తెలిసిందే.

దీంతో DISCOలో D, S రోల్స్ రివీల్ అయిపోయాయని, మిగతా వారిని త్వరలోనే ఇంట్రడ్యూస్ చేస్తారని చెబుతున్నారు. ఇప్పుడు I, C, O ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా స్టార్ నటుడు సత్యరాజ్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. సినిమాలో ఆయన పాత్ర రాజశేఖర్ అని అనౌన్స్ చేశారు. మూవీలో ప్రీతి రోల్ ను స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాబట్టి వారిద్దరూ DISCOలో భాగం కాదని సినీ ప్రియులు చెబుతున్నారు.

మరి రివీల్ కావాల్సిన ఆ ముగ్గురు ఎవరనేది ఆసక్తిగా అంతా ఎదురుచూస్తున్నారు. అయితే నటుడు ఉపేంద్ర మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఒకరు అవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా మరొకరు అవ్వవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా లోకేష్ ప్లాన్ అదిరిపోయిందనే చెప్పాలి. లియోకు కూడా ఇదే ఫాలో అయిన ఆయన.. ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. మరి కూలితో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    
  • Lokeshkanagaraj 
  • Rajinikanth 
  • Coolie 
  • Kollywood 
  • Filmindustry 
  • Nagarjuna 
  • Uppendra 
  • Shrutihaasan 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS