హైప్ ను చూసి భ‌య‌ప‌డుతున్న హీరోయిన్

ఆల్రెడీ ఈ సినిమా నుంచి వ‌చ్చిన టీజ‌ర్ ఆడియ‌న్స్ కు న‌చ్చ‌డంతో పాటూ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేయ‌డంతో ఆ హైప్ ను చూసి క‌ళ్యాణి భ‌య‌ప‌డుతున్నారు.;

Update: 2025-08-23 14:59 GMT

టొవినో థామ‌స్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, న‌స్లేన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన సినిమా లోకా. ఆగ‌స్ట్ 28న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా ఈ మూవీపై ఆల్రెడీ మంచి బ‌జ్ నెల‌కొంది. అఖిల్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన క‌ళ్యాణి ఈ సినిమా విష‌యంలో భ‌య‌ప‌డుతున్నారు. లోకా అనే ఫీమేల్ సెంట్రిక్ సూప‌ర్ హీరో సినిమాలో క‌ళ్యాణి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు.

లోకా టీజ‌ర్ కు భారీ రెస్పాన్స్

ఆల్రెడీ ఈ సినిమా నుంచి వ‌చ్చిన టీజ‌ర్ ఆడియ‌న్స్ కు న‌చ్చ‌డంతో పాటూ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేయ‌డంతో ఆ హైప్ ను చూసి క‌ళ్యాణి భ‌య‌ప‌డుతున్నారు. సినిమా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న క‌ళ్యాణి టీజ‌ర్ గురించి మాట్లాడుతూ అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. లోకా టీజ‌ర్ చాలా మందికి న‌చ్చింద‌ని, టీజ‌ర్ కు ఇంత‌టి భారీ రెస్పాన్స్ ను ఊహించ‌లేద‌ని చెప్పారు.

ఇంత‌టి హైప్ ఊహించ‌లేదు

లోకా టీజ‌ర్ విష‌యంలో తాము ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వ‌చ్చింద‌ని, ఈ సినిమా మార్వెల్, డూన్ లాంటి సినిమా కాద‌ని, ఆడియ‌న్స్ చూడ‌బోయేది ఒక ప్రాప‌ర్ మ‌ల‌యాళీ సినిమాను మాత్ర‌మేన‌ని, మ‌ల‌యాళీల‌కు తెలిసిన విష‌యాల‌కు సూప‌ర్ హీరో ఎలిమెంట్ ను జోడించామ‌ని, మ‌ల‌యాళ మూవీగానే దీన్ని చూడాల‌ని, కాక‌పోతే ఇందులో విభిన్న‌మైన విష‌యాలుంటాయ‌ని క‌ళ్యాణి తెలిపారు.

మ‌ల‌యాళీ సినిమా మాత్ర‌మే

ఈ సినిమా మిన్న‌ల్ ముర‌ళిలాగా ఓ మ‌ల‌యాళ సినిమానే అని, ఇది కూడా సూప‌ర్ హీరో లాంటి సినిమానే కానీ సినిమా మొత్తం మ‌ల‌యాళ ఫ్లేవ‌ర్ ఉంటుంద‌ని చెప్పి సినిమాపై ఉన్న హైప్ ను త‌గ్గించి, ఆడియ‌న్స్ కు సినిమాలోని అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే క‌ళ్యాణి ఈ మాట‌ను చెప్పి మంచి ప‌నే చేశారు. ఎందుకంటే ఆడియ‌న్స్ లోకాను మార్వెల్ టైప్ మూవీగా ఊహించుకుని థియేట‌ర్ల‌కు వ‌స్తే ఆ సినిమాను చూసి వాళ్లు సంతృప్తి చెంద‌రు. కాబ‌ట్టి సినిమాలో ఏముంద‌నే విష‌యాన్ని ముందే ఓ క్లారిటీ ఇచ్చేస్తే మూవీ లాంగ్ ర‌న్ కు అది ఉప‌యోగ‌ప‌డే వీలుంద‌ని ఆలోచించే క‌ళ్యాణి ఈ ప‌ని చేసిన‌ట్టున్నారు.

Tags:    

Similar News