పొలిటికల్ సైడ్ వెళ్తే ఎలా ఉంటుందో అర్థమైంది : మౌళి
90స్ వెబ్సిరీస్ ఫేమ్ మౌళి తనూజ్ తాజాగా లిటిల్ హార్ట్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.;
90స్ వెబ్సిరీస్ ఫేమ్ మౌళి తనూజ్ తాజాగా లిటిల్ హార్ట్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీటీమ్ ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఇందులో హీరోగా నటించిన మౌళికి తన రియల్ లైఫ్ లో ఎదురైన ఓ అనుభవం గురించి ప్రశ్న అడిగారు.
2024 లోక్ సభ ఎన్నికల సమయంలో మౌళి సోషల్ మీడియాలో చేసిన ఓ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీనికిగాను ఓ పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతిన్నాయని అతడిని ట్రోల్స్ చేశారు. ఆన్ లైన్ లోనే విపరీతమైన బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు. దీనిపై అప్పుడే స్పందించిన మౌళి దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. దీంతో ఈ వ్యవహారం సద్దమణిగింది. అయితే ఇదే వ్యవహారం గురించి తాజాగా మౌళి ఏమన్నాడంటే?
ఆంధ్ర ప్రదేశ్ లో గత ఎన్నికలప్పుడు మీ మీమ్స్ పొలిటికల్ సైడ్ వెళ్లింది. మీకు ఏమైన ఇబ్బదులు కలిగాయా అని అడగ్గా.. మౌళి సమాధానం ఇచ్చాడు. నేను ఏది చేసినా జనాలను నవ్వించడానికే చేస్తా. కానీ దురదృష్టవశాత్తు ఒక వీడియో మాత్రం పొలిటికల్ సైడ్ వెళ్లింది. దానికి క్షమాపణలు కూడా కోరాను. పొలిటికల్ సైట్ వెల్తే ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అనిపించింది.
కమెడియన్ అన్నప్పుడు సొసైటీలో జరుగుతున్న దానిపైనే జోక్స్ రాస్తాం. అలా అనుకోకుండా అది అలా అయ్యిందే తప్పా, ఎవరినీ ఉద్దేశించి చేసింది కాదు. కావాలని రాసింది కాదు. దీంతో ఆ తర్వాత పొలిటికల్ సైడ్ వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. అప్పుడే ఫిక్స్ అయ్యి పొలిటికల్ సైడ్ జోక్స్ మిస్ ఫైర్ అవ్వకుండా చూసుకుంటున్నా. అని మౌళి అప్పటి కాంట్రవర్సీ గురించి క్లారిటీ ఇచ్చాడు.
కాగా, ఈ సినిమాలో శివాణి నాగారాం హీరోయిన్ గా నటించారు. 90స్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సినిమాను నిర్మించారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి సెప్టెంబరు 12న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.