సమంత ట్రెండీ ఫోటోషూట్ - సోషల్ మీడియాలో సెగలు!
టాలీవుడ్ క్వీన్ సమంత రూత్ ప్రభు మరోసారి తన గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. 'ది నాడ్' మ్యాగజైన్ మే 2026 కవర్ షూట్ కోసం ఆమె చేసిన ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.;
టాలీవుడ్ క్వీన్ సమంత రూత్ ప్రభు మరోసారి తన గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. 'ది నాడ్' మ్యాగజైన్ మే 2026 కవర్ షూట్ కోసం ఆమె చేసిన ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మెటాలిక్ గౌన్ నుండి ముత్యాల డ్రెస్ వరకు సమంత ధరించిన ప్రతి అవుట్‌ఫిట్ ఒక అద్భుతంలా ఉంది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, సినిమాల్లో మహిళల ప్రాధాన్యత గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి.
మంచులో మెరిసిన దేవత:
సమంత ఈ ఫోటోషూట్‌లో చాలా డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు. ముఖ్యంగా డీప్ నెక్ లైన్‌తో ఉన్న మెటాలిక్ మెష్ గౌన్‌లో ఆమెను చూస్తుంటే ఒక దేవతలా అనిపిస్తోంది. ఆమె చుట్టూ ఉన్న మంచు దిమ్మెలు, ఆ డ్రెస్ కి వున్న అద్దాల టాసెల్స్ ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్‌ను ఇచ్చాయి. సమంత ఫేస్ ఎప్పుడూ పర్ఫెక్ట్ అని, ఈ షూట్‌లో ఆమె లుక్ చూస్తే అది మరోసారి రుజువైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ముత్యాల డ్రెస్సులో మెరిసిపోతూ:
మరో లుక్‌లో సమంత ఐవరీ కలర్ ముత్యాల డ్రెస్సులో దేవకన్యలా మెరిసిపోయారు. ఈ అవుట్‌ఫిట్‌ను చేత్తో కుట్టిన ముత్యాలతో చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీనికి తోడు బుల్గారీ జ్యువెలరీ, రెనే కావిల్లా ఫుట్‌వేర్‌తో సమంత లుక్ కంప్లీట్ అయ్యింది. ఇక ఈ అవాంట్-గార్డ్ స్టైల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
కథే అసలైన హీరో:
ఈ షూట్ సందర్భంగా సమంత చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కొత్త "ఈ సినిమాలో హీరో ఎవరు?" అని అడిగితే, "నేను ఇకపై అలాంటి సినిమాలు చేయడం లేదు" అని ఆమె కూల్‌గా బదులిచ్చారు. తాను చేసే సినిమాల్లో కథే అసలైన హీరో అని, నిర్మాతలు లేదా నటుల కంటే కథే గొప్పదని ఆమె స్పష్టం చేశారు. మహిళల ఆలోచనలకు ప్రతిబింబంగా ఉండే పాత్రలనే తాను ఎంచుకుంటానని ఆమె తెలిపారు.
మా ఇంటి బంగారం :
సమంత 'మా ఇంటి బంగారం' జూన్ 19, న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్-ఫ్యామిలీ డ్రామాను సమంత స్వయంగా తన 'ట్రలాలా మూవీ పిక్చర్స్' బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో ఆమె ఒక కొత్త పెళ్లికూతురిగా కనిపిస్తూనే, తన వెనుక ఉన్న ఒక బలమైన గతాన్ని రివీల్ చేయబోతున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
సమంత కేవలం అందంతోనే కాదు, తన ఆలోచనలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమాలో మార్పు రావాలంటే రిస్క్ తీసుకోవాలని ఆమె నమ్ముతున్నారు. 'మా ఇంటి బంగారం' చిత్రంతో ఆమె మరో భారీ విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం. సామ్ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సమ్మర్‌లో పూనకాలు ఖాయం!