థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా దూసుకుపోతున్న డెకాయిట్.. ట్రెండింగ్ లో నిలిచిన రొమాంటిక్ రివేంజ్ డ్రామా!
ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి రోజే రూ. 15 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.;
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ యాక్షన్ డ్రామా 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. థియేటర్లలో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ, విడుదలైన తక్కువ సమయంలోనే టాప్-1 పొజిషన్‌కు చేరుకొని రికార్డులు సృష్టిస్తోంది. ఈ రొమాంటిక్ రివేంజ్ డ్రామాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఆ విశేషాలు చూద్దాం ..
ప్రైమ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్:
నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైన 'డెకాయిట్' సినిమా, ప్రస్తుతం ఇండియాలోనే నంబర్ వన్ మూవీగా దూసుకుపోతోంది. థియేటర్లలో మిస్ అయిన వారితో పాటు, ఇప్పటికే చూసిన వారు కూడా శేష్ పెర్ఫార్మెన్స్ కోసం మరోసారి ఓటీటీలో వీక్షిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా టాప్ ట్రెండింగ్‌లో నిలవడం విశేషం.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ:
ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి రోజే రూ. 15 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 34.77 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, ఫుల్ రన్‌లో రూ. 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి నిర్మాతలకు భారీ లాభాలను అందించింది. అడివి శేష్ కెరీర్‌లో మరో అద్భుతమైన హిట్ సినిమాగా ఇది నిలిచిపోయింది.
శేష్ నటన.. మృణాల్ గ్లామర్:
సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం అడివి శేష్ అద్భుతమైన యాక్షన్, మృణాల్ ఠాకూర్ గ్లామర్ అని చెప్పాలి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా తనదైన నటనతో సినిమాకు వెయిట్ పెంచారు. ఇక ప్రకాష్ రాజ్, సునీల్ వంటి అనుభవజ్ఞులైన నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
డెకాయిట్' చిత్రంలో హరిదాస్ పాత్ర కోసం అడివి శేష్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిస్థాయిలో మార్చుకుని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. మదనపల్లి యాసలో ఆయన పలికిన డైలాగులు, యాక్షన్ సీన్స్‌లో చూపించిన పౌరుషం వెండితెరపై అద్భుతంగా పండాయి. ఇక జూలియట్‌గా మృణాల్ ఠాకూర్ తన కళ్లతోనే భావోద్వేగాలను పండిస్తూ మరోసారి నటిగా మెస్మరైజ్ చేసింది .
భీమ్స్ మ్యూజిక్ హైలైట్:
సినిమాకు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఒక పెద్ద ఎసెట్. ముఖ్యంగా 'చిచ్చు బుడ్డి' సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటూ మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని యాక్షన్ సీన్లను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు ఎస్ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి.
మొత్తానికి 'డెకాయిట్' మూవీ అడివి శేష్ ఖాతాలో మరో గర్వించదగ్గ సినిమాగా చేరిపోయింది. థియేటర్లలో సృష్టించిన ప్రభంజనం కంటే ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక వరుసగా ఆరు విజయాలను అందుకున్న అడివి శేష్, ఈ 'డెకాయిట్' మూవీతో తన సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగిస్తూ థియేటర్లలోనే కాకుండా ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక మీరు కనుక పక్కా రొమాంటిక్ రివేంజ్ డ్రామాను చూడాలనుకుంటే వెంటనే అమెజాన్ ప్రైమ్‌లో 'డెకాయిట్' చూసేయండి.