బాలయ్య- కొరటాల మూవీకి క్రేజీ టైటిల్
టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కొత్త డెఫినెషన్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే కొత్త సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.;
టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు కొత్త డెఫినెషన్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే కొత్త సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొనగా, ఇప్పుడు సినిమా టైటిల్ గురించిన ఓ క్రేజీ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. NBK112 వర్కింగ్ టైటిల్‌తో ముందుకెళ్తున్న ఈ సినిమాకు కార్పెంటర్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.
బాలయ్య కెరీర్‌లో ఎన్నో మాస్ టైటిల్స్ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే కార్పెంటర్ అనే టైటిల్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండటమే కాకుండా కథలో పాత్ర స్వభావాన్ని కూడా బలంగా ప్రతిబింబిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ వృత్తిలో కనిపించే వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో ఎలా ఉద్యమకారుడిగా మారతాడు? అనే లైన్ చుట్టూనే కథ తిరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అధికారానికి ఉద్దేశం తోడైతే... అది ఉద్యమంగా మారుతుందనే పవర్‌ఫుల్ కోట్ తో ఈ సినిమా రూపొందుతుందని చెప్తున్నారు. కొరటాల శివ గత సినిమాల మాదిరిగానే ఇందులో కూడా సామాజిక అంశాలను కమర్షియల్ మాస్ యాక్షన్‌తో మిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌ను కేవలం యాక్షన్ ఎంటర్టైనర్‌గా కాకుండా, బలమైన ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ డ్రామాగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ముఖ్యంగా బాలయ్య పాత్ర డిజైన్‌పై కొరటాల ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు అభిమానులు చూడని కొత్త బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మేనరిజమ్‌తో బాలకృష్ణ కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించడం కూడా ప్రాజెక్ట్‌కు అదనపు హైప్ ను తెచ్చింది. మాస్ బీట్‌లతో పాటు ఎలివేషన్ సీన్స్‌కు అనిరుధ్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా పలు ఆసక్తికర పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యా బాలన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి. గతంలో బాలయ్యతో కలిసి నటించిన ఎక్స్‌పీరియెన్స్ ఉండటంతో ఆమెను కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నారనే టాక్ ఉంది. మరోవైపు ఈ సినిమా పొలిటికల్ టచ్‌తో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ప్రస్తుతం బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే కొరటాల మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్స్ దాదాపు పూర్తి కావడంతో ఈ నెల 21న గ్రాండ్‌గా ప్రారంభోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. టైటిల్‌పై ఇంకా ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాకపోయినా, కార్పెంటర్ అనే పేరు మాత్రం మాస్ ప్రేక్షకుల్లో ఇప్పటికే వైరల్‌గా మారింది.