డ్రెస్సింగ్ స్టైల్‌తోనే సెగలు రేపుతున్న శోభిత!

ఫ్యాషన్ అంటే కేవలం ఖరీదైన బ్రాండ్లు కాదు, మనం ధరించే దుస్తులను ఎంత హుందాగా క్యారీ చేస్తామనేదే అసలైన ఫ్యాషన్ అని నిరూపిస్తోంది శోభితా ధూళిపాళ.;

Update: 2026-05-09 12:00 GMT

ఫ్యాషన్ అంటే కేవలం ఖరీదైన బ్రాండ్లు కాదు, మనం ధరించే దుస్తులను ఎంత హుందాగా క్యారీ చేస్తామనేదే అసలైన ఫ్యాషన్ అని నిరూపిస్తోంది శోభితా ధూళిపాళ. నెట్, ఆర్గాంజా, షీర్ చీరలను ధరించడంలో ఆమెకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది. మనీష్ మల్హోత్రా నుండి సబ్యసాచి వరకు టాప్ డిజైనర్లు రూపొందించిన పారదర్శక దుస్తుల్లో ఆమె కనిపిస్తుంటే, ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ విశేషాలు చూద్దాం..



 


మనీష్ మల్హోత్రా సిల్వర్ సీక్విన్ మ్యాజిక్:

శోభితా ఫ్యాషన్ సెన్స్ గురించి చెప్పాలంటే ఆమెకి ఎవరు సాటి రారనే చెప్పాలి. ఆమె ఫోటో షూట్స్ చుస్తే ఎవరికైనా వావ్ అనాలనిపిస్తుంది. ఇక ఆమె కట్టిన సిల్వర్ సీక్విన్ నెట్ చీర గురించి కచ్చితంగా చెప్పాలి. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ సిల్వర్ వర్క్ చీరలో ఆమె ఒక దేవకన్యలా మెరిసిపోయింది. దీనికి జతగా స్వీట్ హార్ట్ నెక్ లైన్ బ్లౌజ్, వేవీ హెయిర్ స్టైల్‌తో ఆమె ఇచ్చిన పోజులు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నెట్ చీరను ఇంత క్లాసీగా కట్టడం శోభితకే సాధ్యమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



 


ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ మెరుపులు:

ఇటీవల జరిగిన ఒక అవార్డు వేడుకలో శోభితా సబ్యసాచి డిజైన్ చేసిన షీర్ ఎంబ్రాయిడరీ చీరలో కనిపించింది. పారదర్శకమైన ఫ్యాబ్రిక్ మీద అద్భుతమైన ఫ్లోరల్ మోటిఫ్స్, జిగేల్ మనే సీక్విన్ డీటెయిలింగ్‌తో ఉన్న ఈ చీర ఆమెకు ఒక రాయల్ లుక్‌ను ఇచ్చింది. ఆ పిక్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయగానే ఫాన్స్ నుండి దిగి వచ్చిన దేవ కన్య లాగ ఉందని కామెంట్స్ తో నింపేశారు. ఇక ఏ రెడ్ కార్పెట్ ఈవెంట్ అయినా, తన సొంత స్టైల్‌తో ఆ వేదికకే ప్రత్యేక ఆకర్షణగా నిలవడం శోభితా ప్రత్యేకత.



 


తోరాణి ఆర్గాంజా.. పాతకాలపు అందం:

ఇక కేవలం గ్లామర్ మాత్రమే కాదు, మన భారతీయ సంప్రదాయాన్ని ఆధునిక హంగులతో చూపించడంలో శోభితా ఎప్పుడూ ముందుంటుంది. తోరాణి బ్రాండ్ నుండి వచ్చిన ఆర్గాంజా శారీ సెట్లలో ఆమె లుక్ అద్భుతం. ఇక స్వచ్ఛమైన తెల్లటి ఆర్గాంజా మీద ఆరి ఎంబ్రాయిడరీ చేసిన ఈ చీర, ఆమెకు ఒక వింటేజ్ అందాన్ని ఇచ్చింది. చందేరీ బ్లౌజ్‌తో ఆమె కట్టిన ఈ శైలిని చూసి ఫ్యాషన్ ప్రియులు 'పిక్చర్ పర్ఫెక్ట్' అని ప్రశంసిస్తున్నారు.



 


గోల్డ్ సీక్విన్ హంగామా:

మరో ఫోటోషూట్‌లో శోభితా సీమా గుజ్రాల్ డిజైన్ చేసిన గోల్డ్ సీక్విన్ చీరలో ధగధగ మెరిసిపోయింది. దీనికి అమ్రపాలి జ్యువెలరీని జతచేసి పక్కా దేశీ ఫ్యాషన్ ఐకాన్‌లా కనిపించింది. ఇక నితికా గుజ్రాల్ డిజైన్ చేసిన బ్లష్ పింక్ నెట్ చీరలో ఆమె లుక్ చాలా సాఫ్ట్‌గా, ఎలిగెంట్‌గా ఉంది. ఇలా రకరకాల షీర్ ఫ్యాబ్రిక్స్‌ను క్యారీ చేయడంలో శోభితాకు సాటి మరెవరూ లేరని చెప్పాలి.




 


శోభితా ధూళిపాళ అంటేనే ఒక బ్రాండ్ ఆఫ్ క్లాస్ అండ్ గ్రేస్. ఫ్యాషన్ అనేది మనం వేసుకునే బట్టల్లోనే ఉంటుందని, వాటిని ఆత్మవిశ్వాసంతో ధరించినప్పుడే అసలైన అందం వస్తుందని ఆమె నిరూపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ప్రతి ఫోటో ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారుతోంది. ఆమె ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతూ, ఆమె క్రేజ్ ను మరోసారి నిరూపించాయి..

Tags:    

Similar News