ల‌య‌ను జీతం అడిగిన దిల్ రాజు!

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి ఓ వెలుగు వెలిగిన ల‌య ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీని వ‌దిలేసి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-06-27 19:30 GMT

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి ఓ వెలుగు వెలిగిన ల‌య ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీని వ‌దిలేసి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో అవ‌కాశాలు వ‌దులుకుని అమెరికా వెళ్లిపో యింది. అటుపై పెళ్లి...పిల్ల‌లు అంటూ కుటుంబ జీవితంలో ప‌డిపోయింది. మ‌ళ్లీ చాలాకాలానికి టాలీవుడ్ వైపు మ‌న‌సు మ‌ళ్ల‌డంతో నితిన్ హీరోగా న‌టిస్తోన్న `త‌మ్ముడు` సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.

ఈ సినిమాలో నితిన్ సోద‌రి పాత్ర‌లో ల‌య న‌టిస్తుంది. సినిమాలో కీల‌క‌మైన పాత్ర ఇది. అక్కా-త‌మ్ముడు సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్ర‌మిది. ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు ల‌య‌ను ప్ర‌త్యేకంగా తీసుకొచ్చారు. అమెరికాలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేసుకుటోన్న ల‌య‌కు రాజు గారు ఫోన్ చేసి అడ‌గ‌గా వెంట‌నే ఒప్పు కుందిట‌. అదే స‌మ‌యంలో రాజుగారు ల‌య ఉద్యోగం ద్వారా ఎంత సంపాదిస్తోందో అడిగారుట‌.

కానీ ల‌య చెప్పిన ఫిగ‌ర్ చూసి అంత ఇక్క‌డ రాదు. అదీ ఒక సినిమా కోసం ఉద్యోగం వ‌దిలేసి రావ‌డం క‌రెక్టో కాదా? ఆలోచించుకోమ‌న్నారుట‌. అయినా ల‌య `త‌మ్ముడు` చిత్రంలో బ‌ల‌మైన పాత్ర కావ‌డంతో..కంబ్యాక్ కి ఇంత‌కు మించి స‌రైన స‌మ‌యం రాద‌ని భావించి ఉద్యోగం వ‌దిలేసి వ‌చ్చిన‌ట్లు తెలిపింది. ఆమె మాట‌ల్ని బ‌ట్టి సినిమాల విష‌యంలో ల‌య సీరియ‌స్ గానే ఉంది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా మంచి అవ‌కాశాలు వ‌స్తాయి.

అక్క పాత్ర‌లు...చెల్లి పాత్ర‌లు...వ‌దిన పాత్ర‌లకు ల‌య‌ను తీసుకునే అవ‌కాశం ఉంది. ఒక‌ప్ప‌టి హీరోయిన్ కాబ‌ట్టి ఆ ర‌క‌మైన పాత్ర‌ల‌కు కొద‌వ‌లేదు. పారితోషికం ప‌రంగానూ ఆమెకు ఉన్న ఇమేజ్ ఆధారంగా బాగానే చెల్లిస్తారు. త‌మ్ముడు రిలీజ్ త‌ర్వాత ల‌య ఎలాంటి ఛాన్సులందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News