మెగా కోడలు ఇంటికే పరిమితమా!
తాజాగా లావణ్య గర్భం దాల్చిన విషయాన్ని అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.;
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లైన తర్వాత వెండి తెరపై మెరిసింది లేదు. బుల్లి తెరపై ఓటీటీ సిరీస్ ల ద్వారా అలరించింది తప్ప పెద్ద తెర ప్రేక్షకులకు మాత్రం దూరంగానే ఉంది. వరుణ్ తేజ్ తో లావణ్య వివాహం 2023 నవంబర్ లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. పెళ్లికి ముందు `హ్యాపీ బర్త్ డే` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అటుపై తెరకే దూరమైంది.
తాజాగా లావణ్య గర్భం దాల్చిన విషయాన్ని అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది పండంటి పాపాయికి జన్మనివ్వనుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో లావణ్య కెరీర్ కంటున్యూ అవుతుందా? అంటే అతి కష్టమనే ఫిలిం సర్కిల్స్ లో చర్చకొస్తుంది. బేసిక్ గా లావణ్య సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంది. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ డీసెంట్ రోల్స్ మాత్రమే చేసుకుంటూ వచ్చింది.
ఈ క్రమంలో చాలా ప్లాప్ లు ఎదురైనా ఎక్కడా నిబంధన అతిక్రమించకుండా పని చేసుకుంటూ వచ్చింది. లావణ్య తల్లిదండ్రులు అన్నలు..వదినలు కుటుంబమంతా లాయర్లు...జడ్జ్ లు. చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణ. ఇప్పటికీ అదే క్రమ శిక్షణతో ముందుకెళ్తుంది. మెగా ఫ్యామిలీ ఇంట కోడైలన తర్వాత మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. వివాహం తర్వాత దాదాపు ఇంటికే పరిమితమైంది.
కానీ వివాహానికి ముందు కమిట్ అయిన కొన్ని సినిమాలు మాత్రం అనివార్య కారణాలతో ఇప్పటికీ రిలీజ్ కాలేదు. తమిళ్ లో `తానల్` అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అలాగే `సతీ లీలావతి` అనే మరో చిత్రం కూడా చేస్తోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ అనంతరం లావణ్య కెరీర్ కంటున్యూ అవుతుందా? లేదా? అన్నది క్లారిటీ వస్తుందని సన్నిహిత వర్గాల సమాచారం.