• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్‌ హీరో మూవీ కీలక...

స్టార్‌ హీరో మూవీ కీలక అప్‌డేట్‌

| విడుదల పార్ట్‌ 2 రిలీజ్ అయిన వెంటనే సూర్య హీరోగా వడివాసల్‌ సినిమాను ప్రారంభించాలని వెట్రి మారన్ ప్లాన్‌ చేస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-09-14 07:12 GMT

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య నటించిన మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ 'కంగువా' ఈ అక్టోబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజు రజినీకాంత్‌ నటించిన వేట్టయన్‌ సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో కంగువా ను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా అక్టోబర్‌ లోనే కంగువా ను విడుదల చేయాలని దర్శకుడు శివ ప్రయత్నాలు చేస్తున్నాడు. గత ఏడాది కాలంగా ఊరిస్తున్న కంగువా సినిమా తమిళ్ బాహుబలి అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ స్థాయి వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ఒక వైపు కంగువా విడుదలకు రెడీ అవుతున్న సమయంలో మరో వైపు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సూర్య 44 సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది చివరి వరకు ఆ సినిమా ను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. కార్తీక్‌ సుబ్బరాజ్ దర్శకత్వంలో కంటే ముందు వెట్రిమారన్‌ దర్శకత్వంలో సూర్య సినిమా రూపొందాల్సి ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌ లో గత ఏడాదిలోనే 'వడివాసల్‌' సినిమాను ప్రకటించారు. జల్లికట్టు నేపథ్యంలో సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. సినిమాకు సంబంధించి తమిళ్‌ ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. వెట్రిమారన్ వంటి విభిన్న చిత్రాల దర్శకుడితో సూర్య సినిమా అంటే కచ్చితంగా ఆ స్థాయిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి.

సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వడివాసల్‌ సినిమా ప్రకటించి చాలా కాలం అయింది. షూటింగ్‌ ప్రారంభం కాక పోవడంతో పాటు, స్క్రిప్ట్‌ విషయంలో విభేదాలు వచ్చాయి అంటూ పుకార్లు షికార్లు చేయడంతో సినిమా క్యాన్సల్‌ అయిందే వార్తలు వచ్చాయి. తమిళ్‌ మీడియాలో ప్రముఖంగా వచ్చిన ఆ పుకార్లను దర్శకుడు వెట్రిమారన్‌ స్వయంగా ఖండించాడు. సూర్య తో సినిమా ఉంటుందని ఆయన తెలియజేశాడు. విడుదల పార్ట్‌ 1 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో విడుదల పార్ట్‌ 2 పై ఎక్కువ ఫోకస్‌ ను పెట్టి వెట్రి మారన్ రూపొందిస్తున్నాడు. అందుకే చాలా ఎక్కువ సమయం ఆ సినిమాకి కేటాయించాల్సి వస్తుంది.

విడుదల పార్ట్‌ 2 రిలీజ్ అయిన వెంటనే సూర్య హీరోగా వడివాసల్‌ సినిమాను ప్రారంభించాలని వెట్రి మారన్ ప్లాన్‌ చేస్తున్నాడు. తమిళ మీడియాలో వస్తున్న కొత్త వార్తల అనుసారం వడివాసల్‌ సినిమా వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను వెట్రి మారన్ రూపొందించబోతున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌ అవ్వడంతో కాస్త ఎక్కువ సమయం ఈ సినిమాకు కేటాయించాల్సి ఉంటుందట. కనుక 2025 లో షూటింగ్‌ ను ప్రారంభించి 2026 లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది కంగువా తో రాబోతున్న సూర్య వచ్చే ఏడాది కార్తీక్‌ సుబ్బరాజు సినిమా, ఆ తర్వాత వడివాసల్‌ సినిమాతో రాబోతున్నాడు.

Tags:    
  • Suriya 
  • Kanguva 
  • Tamilmovies 
  • Suriya44 
  • Karthiksubbaraju 
  • Vaadivaasal 
  • VetriMaran 

Similar News

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

Copyright @2026

Powered by Blink CMS