ఆ రెండు చిత్రాలు ఇలా.. మరి రష్మిక గర్ల్ ఫ్రెండ్ ఎలా?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్లు.. తెలుగులో ఆ జోనర్ లో రూపొందిన చిత్రాల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ కూడా అందుకున్నారు. అదే సమయంలో తమ చిత్రాలతో సినీ ప్రియులను ఓ రేంజ్ లో అలరించారు.
కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాయి! స్టోరీ పరంగా ఓకే అయినా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టలేదు. దీంతో కమర్షియల్ హిట్స్ గా నిలవలేదు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ విషయం వైరల్ గా మారింది. అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు.
టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రీసెంట్ గా 8 వసంతాలు మూవీని రూపొందించింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఆ సినిమా జూన్ 20వ తేదీన విడుదలైంది. శేఖర్ కమ్ముల కుబేర మూవీతో పోటీ పడింది. రిలీజ్ కు ముందు నెలకొల్పిన అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.
రీసెంట్ గా పరదా మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన ఆ సినిమాను ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు. సినిమా కంటెంట్ బాగుందని సినీ ప్రియులు చెబుతున్నా.. ఆడియన్స్ మాత్రం థియేటర్స్ కు వెళ్లినట్లు కనిపించడం లేదు. ఓపెనింగ్స్ బాగా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే అలా లేడీ ఓరియెంటెడ్ జోనర్ పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పలేం. ఈ రోజుల్లో ప్రేక్షకులంతా స్టార్ క్యాస్టింగ్ ను పట్టించుకోవడం లేదు. బడ్జెట్ ను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. కేవలం తమను ఆకట్టుకునే అంశాలు ఉంటే కచ్చితంగా వెళ్తున్నారు. థియేటర్స్ లో సినిమాను ఫుల్ గా ఆదరిస్తున్నారు.
అందుకే మేకర్స్ ఇంకాస్త ఫోకస్ పెడితే థియేటర్స్ లో సినిమాలు మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇప్పుడు రష్మిక నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ పై అందరి ఫోకస్ పడింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ.. మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కాబట్టి ఆ సినిమా లేడీ ఓరియెంటెడ్ జోనర్ లో పాత వైభవాన్ని తిరిగి తీసుకువస్తుందో లేదో చూడాలి.