కురుక్షేత్రం ప్రేక్షకులను మెప్పించిందా..?
మహావతార్ నరసింహా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో యానిమేటెడ్ సినిమాలకు మరింత క్రేజ్ ఏర్పడింది.;
మహావతార్ నరసింహా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో యానిమేటెడ్ సినిమాలకు మరింత క్రేజ్ ఏర్పడింది. ఆల్రెడీ ఎప్పటి నుంచో బుల్లితెర మీద సీరియల్స్ గా రామాయణ, మహాభారత కథలతో వస్తున్నా సినిమాలుగా వాటి ప్రభావం ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా మహావతార్ నరసింహతో ఈ ప్రయత్నం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అలాంటి సినిమాలకు ఎన్నో దారిని చూపించింది. ఇప్పుడు అలాంటి యానిమేటెడ్ సీరీస్ గానే మహాభారతం నేపథ్యంతో కురుక్షేత్రం అనే వెబ్ సీరీస్ వచ్చింది.
కురుక్షేత్ర ఘట్టాలనే ప్రధానంగా..
నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సీరీస్ కురుక్షేత్ర ఘట్టాలనే ప్రధానంగా తీసుకుని తెరకెక్కించారు. కురుక్షేత్ర సీరీస్ ని 18 ఎపిసోడ్స్ గా డిజైన్ చేశారు. ఐతే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ 9 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. మిగతా ఎపిసోడ్స్ మళ్లీ ఈ నెల 24న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సీరీస్ ని ఉజాన్ గంగూలీ డైరెక్ట్ చేశారు.
ఇక కురుక్షేత్రం సీరీస్ కథ ఎక్కడ మొదలవుతుంది అంటే.. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసినా సరే వాళ్లకి ఇవ్వాల్సిన రాజ్యభాగాన్ని కౌరవులు ఇవ్వరు. కనీసం ఐదుగురికి ఐదు ఊళ్లు పంచివ్వమన్నా ఇవ్వరు. దుర్యోధనుడి దురాశ వల్ల ఈ నిర్ణయం తీసుకుంటారు. ఐతే అప్పటికీ కృష్ణుడి మాట మేరకు పాండవులు ఓపికతో ఉంటారు. సంజయుడి రాయభారం కూడా విఫలమవుతుంది. కౌరవులు యుద్ధం కోరుతున్నారని పాండవులు గ్రహిస్తారు. వారు కూడా యుద్ధానికి సిద్ధమవుతారు. ఐతే కృష్ణుడు సాయం కోసం అటు దుర్యోధనుడు, ఇటు అర్జునుడు అడుగుతారు. ఇక తర్వాత కురుక్షేత్రం మొదలవుతుంది. అర్జునుడికి కృష్ణుడు ఎందుకు గీతోపదేశం చేశాడు..? యుద్ధంలో ఏం జరుగుతుంది..? ఎవరు ఏం చేశారన్నది కురుక్షేత్రం కథ.
యానిమేటెడ్ గా ఈ కథ చెప్పాలనుకోవడం పెద్ద సాహసమే..
మహాభారతాన్ని అందులో కురుక్షేత్ర కథను చెప్పడం అంత తేలికైన విషయం కాదు. యానిమేటెడ్ గా ఈ కథ చెప్పాలనుకోవడం పెద్ద సాహసమే. అయినా సరే సీరీస్ ని చాలా బాగా రూపొందించారు. యుద్ధం తో మొదలై మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు. 9 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ వెబ్ సీరీస్ ఎక్కడ పెద్దగా బోర్ కొట్టదు. అంతేకాదు టెక్నికల్ గా యానిమేటెడ్ సినిమానే అయినా మంచి విజువల్స్ తో మెప్పిస్తుంది. ప్రతి పాత్ర గుర్తు పెట్టుకునే విధంగా మణి డిజైనింగ్ తో చూపించారు. కురుక్షేత్ర యుద్ధంలో ఆ గ్రాండియర్ ని ఎక్కడ తగ్గించకుండా మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. అక్కడక్కడ కాస్త స్లో అనిపించ్చడంతో పాటు హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ రిఫరెన్స్ లు తీసుకున్నట్టు అర్థమవుతుంది.