కుబేరలో హీరో ఎవరు.. మాయాబజార్ తో పోల్చిన నాగార్జున..!

ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలుగా నటించిన కుబేర సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతుంది.;

Update: 2025-06-16 04:14 GMT
కుబేరలో హీరో ఎవరు.. మాయాబజార్ తో పోల్చిన నాగార్జున..!

ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలుగా నటించిన కుబేర సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది. సినిమాలో నటించిన ధనుష్, నాగార్జున గెస్ట్ లుగా వచ్చారు.

ఈ ఈవెంట్ లో నాగార్జున స్పీచ్ ఫ్యాన్స్ ని అలరించింది. సినిమా కోసం శేఖర్ కమ్ముల చాలా కష్టపడ్డాడని చెప్పారు నాగార్జున. కుబేరలో ధనుష్, నేను, రష్మిక ఇలా హీరో ఎవరు అన్నది కాదు మాయాబజార్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి ఇలా అందరు హీరోలుగా కనిపిస్తారు. కుబేర కూడా అలానే ఉంటుందని అన్నారు నాగార్జున.

ధనుష్ తో సూపర్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పిన నాగార్జున అతను ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎన్నో తీయాలని అన్నారు. రష్మిక కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అవుతుందని అన్నారు నాగార్జున. ఇక ఫ్యాన్స్ ని ఎప్పుడు లేనిది సింగులర్ లో పిలిచారు నాగార్జున. అంతకుముంచు రష్మిక కూడా ఏంట్రా.. ఆగండ్రా అంటూ ఫ్యాన్స్ ని సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తూ మాట్లాడింది. ఇదే క్రమంలో నాగార్జున కూడా రష్మిక చెప్పినట్టు అంటూ ఫ్యాన్స్ ని రా అని సంభోధిస్తూ మాట్లాడారు. అన్నారు.

అంతేకాదు ఫ్యాన్స్ కు హెచ్చరికగా తాగితే పట్టుకుంటారు జాగ్రత్త అంటూ ఫ్యాన్స్ ని అలర్ట్ చేసారు నాగార్జున. సినిమాకు దేవి మరో హీరో అని తనతో చాలా సినిమాలు చేసినా ఈ సినిమాకు దేవి మ్యూజిక్ హైలెట్ అని అన్నారు నాగార్జున. కుబేర ఈవెంట్ లో నాగార్జున స్పీచ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ సినిమా హీరో విలన్ అన్నట్టుగా కాకుండా కథ పరంగా వెళ్తుందని తెలుస్తుంది.

Tags:    

Similar News