'కుబేరా' బిజినెస్.. ఆంధ్రలో నెవ్వర్ బిఫోర్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో కుబేరా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-06-08 18:19 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో కుబేరా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు. జిమ్ సెర్బ్ కీలక పాత్రలో కనిపించనుండగా.. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ నిర్మించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నాగార్జున ఇటీవల డబ్బింగ్ కంప్లీట్ చేశారు. త్వరలో అన్ని పనులు పూర్తి చేసి.. జూన్ 20న మూవీని గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్.

అందుకు సంబంధించిన పనులు శరవేగంగా చేస్తున్న మేకర్స్.. ప్రీ రిలీజ్ బిజినెస్ పై స్పెషల్ ఫోకస్ చేశారు. అయితే ఆంధ్రా హక్కులను రూ.18 కోట్లకు మేకర్స్ కోట్ చేసినట్లు తెలుస్తోంది. దీని బట్టి సినిమాపై ఎంత హైప్ ఉందో క్లియర్ గా అర్థమవుతుంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బిజినెస్ దాదాపు రూ.40 కోట్లకు చేరుకోవచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే తెలుగులో కుబేరా హైప్ కు ముఖ్య కారణం నాగార్జున అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉన్న ఆయన.. కుబేరాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనుష్ పాత్రతోపాటు ఆయన రోల్ కు సమాన ప్రాధాన్యం ఉందని ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. దీంతో మూవీ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.

మొత్తానికి నాగార్జున ఫ్యాక్టర్ తో ధనుష్ కెరీర్ లోనే తెలుగులో కుబేరా నెవ్వర్ బిఫోర్ బిజినెస్ చేయనున్నట్లు అర్థమవుతుంది. కొత్త రికార్డులు క్రియేట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ధనుష్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాల్లో చాలా ఇక్కడ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు నాగ్ ఫ్యాక్టర్ కూడా ఆయనకు కలిసి వచ్చింది.

అయితే కుబేరా మూవీని శేఖర్ కమ్ముల అద్భుతంగా తీర్చిదిద్దారని టాక్ వినిపిస్తోంది. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. పలు సాంగ్స్ టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. దీంతో మూవీ హిట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరేం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాలి.

Tags:    

Similar News