ఆ పెద్ద సినిమాలతో పాటు.. కుబేర కూడా కూర్చోబెట్టిందిగా..
బిజినెస్ పరంగా థియేటర్లు మళ్ళీ జోరందుకోవడం ఎంతగానో అవసరమైందని అనిపిస్తున్న టైంలో, “కుబేర” అనే సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.;
బిజినెస్ పరంగా థియేటర్లు మళ్ళీ జోరందుకోవడం ఎంతగానో అవసరమైందని అనిపిస్తున్న టైంలో, “కుబేర” అనే సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. టాలీవుడ్ నుంచి వచ్చిన ఈ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ తో షురూ అయింది. థియేటర్స్ బీభత్సంగా నిండిపోతున్నాయి అంటే ఈ సినిమాకి వచ్చిన హైప్ అర్థం చేసుకోవచ్చు. సైలెంట్‌గా వచ్చిన సినిమా, సెన్సేషనల్ హిట్‌గా మారిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇటీవల కాలంలో మన దగ్గరే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన కొన్ని భారీ సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప 2’, ‘అనిమల్’ వందల కోట్ల వసూళ్లు కొల్లగొట్టాయి. అయితే ఈ సినిమాల్లో ఒక కామన్ పాయింట్ కూడా ఉంది. అదే.. మూడు గంటలకు పైగా నిడివి. ఇప్పటి జెనరేషన్‌కి దీర్ఘకాలం స్క్రీన్‌పై కూర్చోవడం కష్టమేనని ఎవరైనా భావిస్తే, ఈ సినిమాలు ఆ అభిప్రాయాన్ని తిరగరాసాయి.
ఇప్పుడు “కుబేర” కూడా ఆ లిస్టులో చేరిపోయింది. ఈ సినిమాకి సుమారు 3 గంటల 15 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఉత్సాహంగా చివరి వరకూ కూర్చున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తన రెగ్యులర్ సబ్జెక్టుల నుంచి బయటకు వచ్చి, థ్రిల్లర్ జానర్‌లో మరోసారి తన మాస్టర్ గేమ్ ను చూపించారు. ధనుష్, నాగార్జున లాంటి విలక్షణ నటులు కలిసి తెరపై ఆ మేజిక్‌ని మరింత బలపరిచారు.
కథనం నుంచి బిజినెస్ వరకు ప్రతి దాంట్లో కుబేర ప్రత్యేకత చూపించింది. హ్యూమన్ ఎమోషన్, సస్పెన్స్, డైలాగ్ రైటింగ్ అన్నింటిలోనూ టాప్ క్లాస్ వర్క్ కనిపించింది. ఈ సినిమా సక్సెస్‌తో మరోసారి రన్‌టైమ్ ఎఫెక్ట్‌పై చర్చ మొదలైంది. చాలా మంది రన్‌టైమ్ ఎక్కువగా ఉంటే ఆడియెన్స్ తట్టుకోలేరని అనుకుంటారు. కానీ కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే.. ఎమోషన్, ఇంటెన్సిటీ, టేకింగ్ అన్ని క్లారిటీగా ఉంటే.. లెంగ్త్ పెద్ద విషయమే కాదని మరోసారి కుబేర నిరూపించింది.
ఇదే ట్రెండ్‌తో చూస్తే, రాబోయే రోజులలో కూడా ఎక్కువ నిడివి ఉన్న సినిమాలకీ మంచి అవకాశాలున్నాయి. ముఖ్యంగా థియేటర్ అనుభూతిని కోరుకునే ప్రేక్షకులకు, కథలో లీనమై ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది బూస్ట్ లా మారుతుంది. ఇక కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.