స్టైలిష్ లుక్ లో కృతి సనన్.. డీప్ అందాలతో సెగలు!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కృతి సనన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.;

Update: 2026-05-07 07:30 GMT

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కృతి సనన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతోనే కాదు అద్భుతమైన స్టైలిష్ మేకోవర్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళ్తే.. బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ప్రోత్సాహంతో జరుగుతున్న ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2026 వేడుకలో భాగంగా పలు బాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్ పై మెరిసారు. ముంబై నగరంలో జరిగిన ఈవెంట్లో పలువురు సెలబ్రిటీలు తమ అందాలతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అదితి రావు హైదరి, కృతి సనన్, వేదాంగ్ రైనా , రసికా దుగ్గల్, మేధా శంకర్, ప్రతిభా రాంటా వంటి సెలబ్రిటీలు తమ అత్యుత్తమ ఫ్యాషన్స్ తో అందరి దృష్టిని మెప్పించారు.



 


ఈ క్రమంలోనే విద్యుత్ దీపాల నడుమ రెడ్ కార్పెట్ పై తన అందమైన అవుట్ ఫిట్ తో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది కృతి సనన్. ఈ ఈవెంట్లో కృతి సనన్ వీ నెక్ సీక్వెన్డ్ టాప్ ను , ఫ్లోయీ ఫాంట్ తో జత చేసి పూర్తిగా తెల్లని దుస్తులను ధరించింది. పాయింటెడ్ వైట్ హీల్స్, నీట్ గా జుట్టును బన్ రూపంలో ముడి చేసి, గ్లాసీ మేకప్ తో తన లుక్ ను పూర్తి చేసింది. అయితే ఈ అందమైన లుక్ వెనుక ప్రముఖ కృతి సనన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత అందమైన అవుట్ ఫిట్ ను డిజైన్ చేయడంతో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.



 


ముఖ్యంగా అవార్డ్స్ వేడుకల్లో కృతి సనన్ ను ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు ఆమెకు అభిమానులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సుకృతి స్టైల్ చేసిన కృతి సనన్ లుక్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఇందులో అమ్మడి అందానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు



 


కృతి విషయానికి వస్తే.. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. కృతి సినిమాల విషయానికొస్తే.. తెలుగులో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.



 


ప్రముఖ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది .అలాగే రష్మిక తో కలసి కాక్ టెయిల్ 2 లో కూడా నటిస్తోంది.. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ముద్దుగుమ్మ. దో పట్టి చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. మొత్తానికైతే అటు నటిగా ఇటు నిర్మాతగా మరింత బిజీగా మారిపోయింది కృతి సనన్.

Tags:    

Similar News