• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలాంటి సినిమా మరోటంటే.....

అలాంటి సినిమా మరోటంటే.. బాబోయ్ వద్దు సార్..!

| ఐతే లేటెస్ట్ గా ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన మురారి సినిమా రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా నెటిజన్లతో స్పెషల్ చాట్ చేస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-07-23 03:00 GMT

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇప్పుడు పూర్తిగా ఫాం కోల్పోయారు కానీ ఒకప్పుడు ఆయన సినిమా అంటే ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వారు. కృష్ణవంశీ మార్క్ సినిమా అంటే అది ఎలాంటి కథ అయినా సరే సూపర్ హిట్ పడాల్సిందే. ఐతే రాను రాను ఆయన డైరెక్షన్ పై తన పట్టు కోల్పోతూ వచ్చారు. చివరగా రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృష్ణవంశీ ఆ సినిమా వల్ల కూడా మరో ఫ్లాప్ చవిచూశాడు. ఐతే లేటెస్ట్ గా ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన మురారి సినిమా రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా నెటిజన్లతో స్పెషల్ చాట్ చేస్తున్నాడు.

ట్విట్టర్ లో అందుబాటులో ఉంటూ ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ వస్తున్న కృష్ణవంశీ తన డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ రంగమార్తాండ గురించి ఒక నెటిజెన్ కామెంట్ పెట్టాడు. రంగమార్తాండ సినిమా తనకు బాగా నచ్చిందని.. అలాంటి సినిమాలు ఇప్పుడు చాలా అవసరమని.. కొంతమందిలో అయినా మార్పు వస్తుందని అన్నారు. ఐతే రంగమార్తాండ లాంటి సినిమా మరోటి చేయాలని కృష్ణవంశీని కోరాడు.

ఐతే ఆ నెటిజన్ అడిగిన దానికి షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చారు కృష్ణవంశీ. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే అది పెద్ద ఫ్లాప్ సినిమా సార్.. థియేటర్లో ఎవరు చూడలేదు. నిర్మాతలకు నాకు అందరికీ పెద్ద లాస్ మళ్లీ అలాంటి సినిమానా.. వద్దు స్వామి అంటూ దండం పెట్టేశాడు. రంగమార్తాండ సినిమా ప్రేక్షకులను అలరించలేదు ఐతే సినిమా చూసిన కొందరు మాత్రం అదో గొప్ప సినిమా అని అప్పట్లోనే చెప్పారు. ఐతే రంగమార్తాండ లాంటి సినిమా మరోటి కావాలని కోరిన నెటిజన్ కి బాబోయ్ వద్దు సార్ అనేశారు కృష్ణవంశీ.

కృష్ణవంశీ కొన్నాళ్లుగా అన్నం అనే సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఐతే ఆ ప్రాజెక్ట్ కు ముహుర్తం బయట పడట్లేదు. కృష్ణవంశీ తిరిగి ఫాంలోకి వస్తే చూడాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లో స్టార్ హీరోలెవరు నటించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కేవీ మార్క్ మూవీ ఒక్కటి పడినా కూడా మళ్లీ సరే ఆయన స్టామినా ప్రూవ్ అవుతుంది.

Tags:    
  • Rangamarthanda 
  • Brahmanandam 
  • Krishnavamsi 
  • Tollywood 
  • Filmindustry 
  • Rangamarthandasequel 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS