కొరటాల తన మిస్టేక్ ను తెలుసుకున్నారా?
సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఒకప్పుడు వరుస విజయాలు సాధించాయి.;
టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఒకప్పుడు వరుస విజయాలు సాధించాయి. ముఖ్యంగా శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి సినిమాలు ప్రేక్షకులను మాత్రమే కాకుండా విమర్శకులను కూడా మెప్పించాయి. ఆ సినిమాల్లో సొసైటీకి సంబంధించిన మెసేజ్ ను హీరో పాత్ర ద్వారా స్ట్రాంగ్ గా చెప్పడం కొరటాల ప్రత్యేకతగా నిలిచింది.
అయితే ఇటీవల ఆయన ఎంచుకున్న స్టోరీలు మాత్రం అదే రేంజ్ లో రిజల్ట్స్ ను ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా ఆచార్య వంటి సినిమాల్లో హీరోను ఒక స్పెషల్ ఏరియాకు చెందిన వ్యక్తిగా చూపిస్తూ, విభిన్న నేపథ్యాలతో కథను నడిపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రేక్షకులకు దగ్గరగా ఉండే ఎమోషన్స్, సామాజిక అంశాలు తగ్గిపోవడం ఆ సినిమాలపై ప్రభావం చూపిందని టాక్ వినిపిస్తోంది.
దీంతో ఇప్పుడు కొరటాల శివ తన గత ఎక్స్పీరియన్స్ లను మొత్తం అబ్జర్వ్ చేసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తనకు బాగా అచ్చొచ్చిన జానర్ అయిన సామాజిక కథల వైపు మళ్లీ మళ్లాలని నిర్ణయించుకున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. అదే ఆలోచనతో నటసింహం నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించబోయే తదుపరి చిత్రాన్ని కొరటాల ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
బాలకృష్ణతో చేయబోయే ఆ ప్రాజెక్ట్ లో కూడా సమాజానికి సంబంధించిన అంశాలను మెయిన్ గా చూపించనున్నారని సమాచారం. గతంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి సినిమాలు ఇచ్చిన విజయాలు కొరటాలకు మంచి పాఠంగా మారాయని, అదే ఫార్మాట్ లో కథను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఈసారి కథలో ఎమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, ప్రేక్షకులకు దగ్గరగా ఉండే విధంగా స్క్రిప్ట్ ను రూపొందిస్తున్నారట.
ఇక బాలకృష్ణ కూడా ప్రస్తుతం కథల ఎంపికలో జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. తన ఇమేజ్ కు సరిపోయే స్టోరీతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా చూస్తున్నారు. కొరటాల శివతో కలిసి పనిచేయడం వల్ల ఒక మంచి మెసేజ్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చే అవకాశముందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే దర్శకులు తమలోని స్ట్రెంత్ ను గుర్తించుకుని వాటిని సరిగ్గా వినియోగించుకోవడం చాలా ముఖ్యం. కొరటాల శివ ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తుండటం మంచి పరిణామమని చెప్పాలి.
గతంలో వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకుని, తనకు బాగా అచ్చొచ్చిన జోనర్ వైపు మళ్లడం ద్వారా ఆయన మళ్లీ విజయాల బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి.. కొరటాల శివ తన గత మిస్టేక్స్ నుంచి పాఠాలు నేర్చుకుని కొత్త దిశగా ప్రయాణం ప్రారంభించారని చెప్పొచ్చు. బాలకృష్ణతో చేయబోయే నెక్స్ట్ మూవీ ఆయన కెరీర్ కు మళ్లీ టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పటికైతే ఆ ప్రాజెక్టుపై మంచి అంచనాలు ఉన్నాయి.