• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దెయ్యం తో నైనా మళ్లీ...

దెయ్యం తో నైనా మళ్లీ దూకుడు మొదలయ్యేనా?

| టాలీవుడ్‌ లో కొన్ని సంవత్సరాలకు ముందు ప్రముఖ రచయితల జాబితాలో కోన వెంకట్ పేరు ముందు వరుసలో ఉండేది

By - Tupaki Desk
Update: 2024-02-26 05:35 GMT

టాలీవుడ్‌ లో కొన్ని సంవత్సరాలకు ముందు ప్రముఖ రచయితల జాబితాలో కోన వెంకట్ పేరు ముందు వరుసలో ఉండేది. అలాంటిది ఇప్పుడు కోన వెంకట్‌ సందడి కనిపించడం లేదు. ఆయన కథలు అందించిన సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో స్టార్ హీరోలు ఆయనను నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.

ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ సినిమాలకు కథ అందించిన కోన వెంకట్ ఇప్పుడు చిన్న సినిమాలకు రచన సహకారం అందించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోన వెంకట్ మళ్లీ తిరిగి పుంజుకోవాలని అభిమానులు చాలా రోజులుగా కోరుకుంటూ ఉన్నారు.

ఆయన కూడా తన కలంకు పదును పెడుతూ మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో నిర్మాతగా కోన వెంకట్‌ నుంచి వరుసగా సినిమాలు వస్తున్నాయి. గతంలో కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి సినిమా సూపర్‌ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది.

గీతాంజలికి సీక్వెల్‌ గా రూపొందుతున్న సినిమాకు 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే టైటిల్ ను పెట్టడం తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల టీజర్ విడుదల అయ్యింది. టీజర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. మార్చి 22న ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాతో కోన వెంకట్‌ మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్‌ మూవీకి కథ ను అందించిన రచయిత కోన వెంకట్‌ మళ్లీ దూకుడు పెంచాలి అంటే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా హిట్ అవ్వాల్సి ఉంది. వరుసగా రెండు మూడు సినిమాలు హిట్ అయితే కచ్చితంగా కోన వెంకట్‌ ని నమ్మి చాలా మంది హీరోలు, దర్శకులు ఆయన్ను నమ్మే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Geethanjalimallivachindi 
  • Geethanjalisequel 
  • Filmindustry 
  • Konavenkat 
  • Anjali 
  • Tollywood 
  • Geethanjalimovie 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS