• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ ఒప్పుకునే దాకా...

ఎన్టీఆర్ ఒప్పుకునే దాకా నిరాహార దీక్ష చేస్తా..!

| తనతో ఆ సినిమా చేసేదాకా ఎన్టీఆర్ ఇంటి ముందు అవసరమైతే నిరాహార దీక్ష చేస్తా అంటున్నారు రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోనా వెంకట్

By - Tupaki Desk
Update: 2024-04-03 11:59 GMT

తనతో ఆ సినిమా చేసేదాకా ఎన్టీఆర్ ఇంటి ముందు అవసరమైతే నిరాహార దీక్ష చేస్తా అంటున్నారు రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోనా వెంకట్. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే రైటర్ గా కోనా వెంకట్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన కోనా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో అభిరుచి గల సినిమాలు చేస్తూ వస్తున్నారు. 2014 లో గీతాంజలి చేసిన కోనా వెంకట్ 10 ఏళ్ల తర్వాత గీతాంజలి మళ్లీ వచ్చింది అంటే ఆ సినిమా సీక్వెల్ చేశారు.

గీతాంజలి సక్సెస్ అవ్వడంతో ఆ సినిమా సీక్వల్ మీద కూడా అదే రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఈమధ్యనే రిలీజైన గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కోనా వెంకట్ అదుర్స్ 2 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అదుర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

వెంకీ 2 చేసే అవకాశం ఉందా అన్న రిపోర్టర్ ప్రశ్నకు సమాధానంగా వెంకీ 2 ఏమో కానీ అదుర్స్ 2 కచ్చితంగా ఉంటుందని అన్నారు కోనా వెంకట్. అదుర్స్ లో చారి పాత్రకు ఎన్టీఆర్ తప్ప మరో హీరో న్యాయం చేయలేడని. ఇండియాలో ఏ నటుడు ఆ పాత్రకు సూటవ్వడని. ఆ ఆహార్యం, ఆ డైలాగ్ మాడ్యులేషన్ ఒక్క ఎన్టీఆర్ వల్లే అవుతుందని అన్నారు. అదుర్స్ 2 కథ రాస్తే మాత్రం ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి ఆ సినిమా చేస్తా అనే వరకు నిరాహార దీక్ష చేస్తానని సరదాగా చెప్పారు కోనా వెంకట్.

అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ నటించిన చారి పాత్ర తారక్ ఫ్యాన్స్ కే కాదు సగటు సినీ ప్రేక్షకులను మెప్పించింది. అదుర్స్ 2 తీస్తే మాత్రం ఆ సినిమా లవర్స్ కు పండుగ అన్నట్టే. ప్రస్తుతం గ్లోబల్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ అదుర్స్ తరహా సినిమాలు చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. కోనా వెంకట్ అడగడం కాదు అదుర్స్ 2 కథ ఇంప్రెస్ చేస్తే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు ఎన్టీఆర్ కూడా అలాంటి పాత్ర ఓకే చేసే అవకాశం ఉంటుంది.

Tags:    
  • Konavenkat 
  • Adhurs2 
  • NTR 
  • Adhurssequel 
  • Tollywood 
  • Geethanjalimallivachindi 
  • Geethanjalisequel 
  • Anjali 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS