• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SSMB 29 : నిర్మాతకు ఆ...

SSMB 29 : నిర్మాతకు ఆ విషయాలు ఏవీ తెలియవట!

| తాజాగా ఈ సినిమా నిర్మాత శ్రీదుర్గ ఆర్ట్స్ అధినేత కేఎల్‌ నారాయణ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు

By - Tupaki Desk
Update: 2024-04-21 05:53 GMT

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ గత రెండేళ్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ షురూ అయ్యాయి. ఇప్పటికే పలు దఫాలుగా రాజమౌళి, మహేష్ బాబు ఇతర టీమ్‌ మెంబర్స్‌ భేటీ అయ్యారు.

తాజాగా ఈ సినిమా నిర్మాత శ్రీదుర్గ ఆర్ట్స్ అధినేత కేఎల్‌ నారాయణ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ మహేష్‌, రాజమౌళి సినిమా కథ రెడీ అయ్యింది. ఆ కథ నాకు తెలుసు. కథ చర్చల సమయంలో నేను పాల్గొన్నాను అన్నాడు.

సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అయ్యేది, విడుదల ఎప్పుడు అయ్యేది ఇంకా ఇతర విషయాల గురించి మాత్రం తాను చెప్పలేను అన్నాడు. ఆ విషయాలు అన్నీ కూడా కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసు అన్నట్లుగా కేఎల్‌ నారాయణ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

సాధారణంగా నిర్మాతలకు వారు నిర్మించే సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తూ ఉంటారు. కొందరు నిర్మాతలు దర్శకులను డామినేట్‌ చేస్తూ అన్నీ తామే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఇది రాజమౌళి సినిమా. కనుక హీరో, నిర్మాతల కంటే కూడా రాజమౌళి నిర్ణయాలే ఫైనల్‌.

సినిమా విషయాలు తెలిస్తే ఏంటి, తెలియకుంటే ఏంటి.. రాజమౌళి తో సినిమా అంటే డబ్బులు ఎన్నైనా పెట్టి చల్లటి గుడ్డ వేసుకుని పడుకోవచ్చు. కనుక కేఎల్‌ నారాయణకు షూటింగ్‌ స్టార్ట్, విడుదల తేదీల విషయంలో అస్సలు టెన్షన్‌ అక్కర్లేదు. అందుకే నారాయణ ఆ విషయాలను పట్టించుకోవడం లేదు.

రాజమౌళి గత సినిమాల ఫలితాల నేపథ్యంలో కేఎల్‌ నారాయణ ఎంత ఖర్చు చేసినా దానికి పది రెట్ల లాభం దక్కడం ఖాయం. అందుకే ఈ సినిమా తర్వాత నిర్మాత కేఎల్‌ నారాయణ మళ్లీ నిర్మాతగా వరుస సినిమాలు నిర్మించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • Klnarayana 
  • Rajamouli 
  • Mahehsbabu 
  • SSMB29 
  • Tollywood 
  • SSMB29movie 
  • Ssrajamouli 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS