బళ్లారి బాబు బండ్లన్న చేతుల్లోనా?
అవసరమైతే తానే సొంతంగా నిర్మాత కూడా కాగలడు. అంతటి సత్తా ఉన్నవాడు కిరీటీ. తనపై వందల కోట్లైనా ఇన్వస్ట్ చేసుకోవడానికి తాను సిద్దమే.;
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరిటీ `జూనియర్` సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఫలితం సంగతి పక్కన బెడితే సినిమాలో కిరిటీ కష్టం కనబడింది. తొలి సినిమాతోనే మంచి డాన్సర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆర్దికంగా ఎంతో స్ట్రాంగ్ అయినా? కిరిటీలో కష్టపడే తత్వం గల వాడని గల వాడని పరిశ్రమకు చూపించాడు. ఇది అతడికి ఓ పెద్ద పాజిటివ్ సైన్ గా చెప్పొచ్చు. ఎలాంటి నట వారసత్వం లేకపోయినా సినిమాలంటే ఎంతో ష్యాషన్ తో వచ్చాడని అర్దమవుతుంది.
అవసరమైతే తానే సొంతంగా నిర్మాత కూడా కాగలడు. అంతటి సత్తా ఉన్నవాడు కిరీటీ. తనపై వందల కోట్లైనా ఇన్వస్ట్ చేసుకోవడానికి తాను సిద్దమే. అయితే అతడిలో ఫ్యాషన్ గురించి బయటకు తెచ్చే ప్రతిభావంతుడైనా డైరెక్టర్ మాత్రమే కావాలి. అయితే ఇప్పుడా బాధ్యతలు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చేతుల్లో పెట్టినట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. గణేష్ నిర్మాణ సంస్థలోనే రెండవ సినిమా నిర్మించేలా చర్చలు జరుగుతున్నాయట. ఈ నేపథ్యంలోనే దర్శకుడి బాధ్యత అతడు తీసుకుంటున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.
ఒకప్పుడు ఇండస్ట్రీలో గణేష్ వేవ్ కొంత కాలం కొనసాగింది. ఆ తర్వాత ప్లాప్ ఎదురవ్వడంతో నిర్మాణానికి దూరమయ్యారు. అప్పటి నుంచి అప్పడప్పుడు సినిమా ఈవెంట్లలో అతిధిగా కనిపించడం తప్ప నిర్మాతగా మాత్రం సినిమాలు చేయలేదు. కానీ గాలి వారసుడి రూపంలో మరో గొప్ప అవకాశం బండ్లన్నకు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రాజెక్ట్ లు సెట్ చేయడంలో గణేష్ ప్రతిభావంతుడే. గతంలో ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ కుమారుడితో కూడా ఓ సినిమా చేసాడు. దర్శక, నిర్మాతలతోనూ గణేష్ కు మంచి పరిచయాలున్నాయి.
పవన్ కళ్యాణ్ కూడా గణేష్ అంటే మంచి వెయిట్ ఇస్తారు. ఈ నేపథ్యంలో మైనింగ్ కింగ్ తనయుడి కోసం గణేష్ ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజానిజాలు తేలాలి. కిరిటీ తొలి సినిమా తెలుగు, కన్నడలో రిలీజ్ చేసాడు. ఈ నేపథ్యంలో రెండవ సినిమా కూడా రెండు భాషల్లోనే ప్లాన్ చేసే అవకాశం ఉంది. కిరీటీ ఆంధ్రా-కర్ణాటక బోర్డర్ బిడ్డ కాబట్టి? రెండు భాషల్లోనూ కలిసొస్తుంది. రెండు భాషలను అనర్గళంగా మాట్లాడగలడు.