గాలి కుమారుడి ఫస్ట్ సింగిల్.. కిరీటి మెస్మరైజ్ చేశాడుగా..
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.;
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ మూవీతో హీరోగా మరికొద్ది రోజుల్లో పరిచయమవుతున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా.. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
కన్నడ సీనియర్ యాక్టర్ రవిచంద్రన్, జెనీలియా కీలక పాత్రలు పోషిస్తుండగా.. వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా మూవీ విడుదల తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే.
జూన్ 22వ తేదీన గ్రాండ్ గా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తాజాగా మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ లెట్స్ లివ్ దిస్ మూమెంట్ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పాట అందరినీ ఆకట్టుకుంటూ సందడి చేస్తోంది.
రోజుకు ఉండే గంటలు.. 24 బేబీ.. అంటూ సాగుతున్న సాంగ్.. ఇప్పుడు నెట్టింట ఫుల్ గా వైరల్ గా మారింది. అందరినీ మెప్పిస్తోంది. మరోసారి డీఎస్పీ తన మార్క్ ను చూపించినట్లు క్లియర్ గా తెలుస్తోంది. యూత్ వైబ్స్ క్రియేట్ చేసే బీట్ అండ్ మ్యూజిక్ క్రేజీగా ఉన్నాయి. స్టార్టింగ్ లోనే ఇది దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్ అని ఎవరైనా చెప్పేయవచ్చు.
శ్రీమణి అందించిన లిరిక్స్ కు స్టార్ సింగర్ జస్ప్రీత్ జాస్ ప్రాణం పోశారు. తన ఎనర్జీ ఏంటో మరోసారి చూపించారు. అయితే సాంగ్ లో కిరీటి రెడ్డి స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆయన డ్యాన్స్ మూవ్స్ సూపర్ గా ఉన్నాయని చెప్పాలి. బాడీ లాంగ్వేజ్ కూడా స్పెషల్ గా ఉంది. క్యూట్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆమె ఎప్పటిలానే తన లుక్స్ తో మైమరిపిస్తోంది. శ్రీలీల, కిరీటి కెమిస్ట్రీ క్యూట్ గా కనిపిస్తోంది. హీరో తన లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. మొత్తానికి ఫస్ట్ సింగిల్.. మంచి హిట్ అయ్యేలా ఉంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సింగిల్ థియేటర్లలోని ప్రతి ఒక్కరికీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ ఇప్పటికే చెప్పగా.. అందుకు తగ్గట్లే సాంగ్ ఉందనే చెప్పాలి. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.