• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోలీవుడ్ 'క'.. అంత...

కోలీవుడ్ 'క'.. అంత భయమెందుకు?

| టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. 'క' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-10-28 06:48 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. 'క' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ థ్రిల్లింగ్ సబ్జెక్టుతో భారీగా తెరకెక్కిన ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణగిరి బ్యాక్ డ్రాప్ రూపొందిన ఆ చిత్రానికి సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 'క' తోనే ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ కానుందీ చిత్రం.

అయితే పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తెరకెక్కినప్పటికీ.. అక్టోబర్ 31వ తేదీన మాత్రం తెలుగులోనే రిలీజ్ అవుతుంది. మిగతా భాషల్లో వారం తర్వాత విడుదల అవ్వనుంది. కోలీవుడ్ వెర్షన్ మూవీ రైట్స్ ను మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ ఆయన నటించిన లక్కీ భాస్కర్ అదే రోజు విడుదల అవుతుంది. దీంతో మాలీవుడ్ లో 'క' మూవీ అదే రోజున రిలీజ్ చేయడం లేదని కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇచ్చారు.

అదే సమయంలో తమిళనాడులో తమకు థియేటర్స్ దొరకలేదని రీసెంట్ గా మీడియాతో చిట్ చాట్ లో తెలిపారు కిరణ్ అబ్బవరం. అందుకే తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో కొన్ని గంటలుగా జోరుగా చర్చ నడుస్తోంది. టాలీవుడ్ లో తమిళ చిత్రాలను అక్కడి మేకర్స్ దర్జాగా రిలీజ్ చేస్తున్నారని, కానీ మన సినిమాలకు అక్కడ థియేటర్స్ దొరక్కపోవడంమేంటని అడుగుతున్నారు.

ఇప్పుడు దీపావళి స్పెషల్ గా కోలీవుడ్ మూవీ అమరన్.. తెలుగులో భారీ స్థాయిలో విడుదల అవుతుంది. ఒక్క ఆ మూవీకే కాదు.. ఎలాంటి పండగల సమయంలోనైనా కూడా తమిళ చిత్రాలకు థియేటర్లు దొరుకుతున్నాయి. అక్కడి హీరోలు అజిత్, విజయ్, విక్రమ్, కార్తీ.. అలా ఎలాంటి బేధం చూపించకుండా సపోర్ట్ అందుతుంది. అలాంటిది ఇప్పుడు మన హీరో సినిమాకు థియేటర్లు ఇవ్వడపోవడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమిళ పరిశ్రమ తెలుగు సినిమాలకు తక్కువ ప్రాధాన్యమిస్తోందని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో అక్కడి హీరోలు.. కిరణ్ అబ్బవరంతో పోటీ పడేందుకు భయపడుతున్నారా అని క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే థియేటర్లు ఇవ్వడం లేదా అని అడుగుతున్నారు. థియేటర్ల దొరక్కపోవడం కాదని.. వాళ్లు ఉద్దేశపూర్వకంగా ఇవ్వకపోయిఉంటారని కామెంట్ల రూపంలో ఆరోపిస్తున్నారు. మరి 'క' మూవీ తమిళంలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Tags:    
  • Kiranabbavaram 
  • KA 
  • Kollywod 
  • Luckybaskhar 
  • Amaran 
  • Kamovie 
  • Wayferermovies 
  • Tamilnadu 
  • Filmindustry 
  • Sandeep 
  • Sujeeth 
  • Theatres 
  • Panindia 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS