• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాతో మీకొచ్చిన సమస్య ఏంటి...

నాతో మీకొచ్చిన సమస్య ఏంటి - కిరణ్ అబ్బవరం

| సోషల్ మీడియాలో సెలబ్రెటీల మీద ట్రోలింగ్స్ దారుణంగా జరుగుతూ ఉంటాయి.

By - Tupaki Desk
Update: 2024-10-30 04:17 GMT

సోషల్ మీడియాలో సెలబ్రెటీల మీద ట్రోలింగ్స్ దారుణంగా జరుగుతూ ఉంటాయి. కిరణ్ అబ్బవరం మీద కూడా అలాగే ట్రోలింగ్ జరిగింది. ఈ నాలుగేళ్ల కాలంలో కిరణ్ ప్రతి ఏడాది ఒకటి, రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో కొన్ని పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కొన్ని కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యాయి. వీటిని పట్టుకొని కిరణ్ పై ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.

తనపై వచ్చే ట్రోల్స్ పైన కిరణ్ అబ్బవరం ‘క’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఏదైనా సాధించాలనే తపనతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ కొంతమంది సపోర్ట్స్ తో బిగ్ స్క్రీన్ పైకి వచ్చాను. దేవుడి దయవలన పెద్ద బ్యానర్స్ లలో సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఈ రోజు నేను ఈ స్టేజ్ మీదకి రావడం వెనుక ఎంతో కష్టం ఉంది. అయితే కొందరు పనిగట్టుకొని ఏమీ తెలుసుకోకుండా ట్రోల్ చేస్తూ ఉంటారు.

ఎంపీ కొడుకు అంటారు. పెద్ద పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందని అంటారు. నాకెలాంటి బ్యాగ్రౌండ్ లేదు. ఇప్పటికి ఊరికి వెళ్తే కూలి పని చేసుకునే లైఫ్ నాది. అయితే కిరణ్ అబ్బవరం ఎదగకూడదా, సినిమాలు చేయకూడదా, సక్సెస్ కాకూడదా… నాతో మీకొచ్చిన సమస్య ఏంటి?. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. జూబ్లీజిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉండే ఒక ప్రొడక్షన్ వారిని ఈ సందర్భంగా అడుగుతున్నాను.

నేను ప్రశ్నించిన తర్వాత మరల నన్ను టార్గెట్ చేస్తారని తెలుసు. అయిన అడుగుతున్న. మీ సినిమాలో నన్ను ట్రోల్ చేసేంత అన్యాయం నేనేం చేసాను. నాతో మాట మాత్రం చెప్పకుండా వారి సినిమాలో నన్ను ట్రోల్ చేశారు. ఎవరో ఫ్రెండ్ చూసి ఫోన్ చేసి చెబితే తెలిసింది. సినిమాలు ఎక్కువ చేస్తే మీకొచ్చిన నొప్పేంటి… రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, సమ్మోహనం, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు హిట్ అయ్యాయి.

నాలుగు సంవత్సరాల్లో 8 సినిమాలు చేస్తే అందులో 4 డీసెంట్ హిట్స్ అయ్యాయి. ఈ విధంగా చూసుకుంటే నేను హీరోగా సక్సెస్ అయినట్లే. ఈ విషయాన్ని నేను గొప్పగా చెప్పుకుంటాను. ఎక్కడైనా, ఎప్పుడైనా ట్రోల్ చేయాలని అనుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి… ఇక్కడికి ప్రతి ఒక్కడు కష్టపడి వచ్చినవాడే. ఎలాంటి సపోర్ట్ లేకపోయిన నా కష్టంతో ఎదుగుతున్నాను అంటూ కిరణ్ సబ్బవరం సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కిరణ్ అబ్బవరం స్పీచ్ తర్వాత సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ పైన చర్చ నడుస్తోంది. కిరణ్ కి చాలా మంది సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు.

Em movie lo troll chesaru? pic.twitter.com/dnhs21fAk6

— dineshuu (@diineshuu) October 29, 2024
Tags:    
  • Kiranabbavaram 
  • KAmovie 
  • Kaprereleaseevent 
  • Trollings 
  • Netizens 
  • Tollywood 
  • Filminndustry 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS