ఆ మూవీతో అబ్బవరం నెక్ట్స్ లెవెల్ కు?
అనిరుధ్ కు పాన్ ఇండియా స్థాయిలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు.;
అసలేమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా సెలబ్రిటీ హోదా దక్కించుకున్న కిరణ్ అబ్బవరం సినిమా సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. కిరణ్ చేసిన మొదటి రెండు సినిమాలూ సక్సెస్ అవడంతో అతనికి అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే వచ్చిన అవకాశాలను ఎందుకు వదులుకోవడమని ప్రతీ ఛాన్స్ ను అందుకుని సినిమాలు చేయడంతో తన కెరీర్ కు కొంచెం మైనస్ అయింది.
క తో ఫామ్ లోకి వచ్చిన కిరణ్
మధ్యలో కొన్ని సినిమాల ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ కిరణ్ అబ్బవరం, తర్వాత క లాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీని తీసి ఆ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆ ఫామ్ ను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న కిరణ్, ఇప్పుడు Kర్యాంప్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్టోబర్ 18న ఈ మూవీ దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది.
Kర్యాంప్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ..
Kర్యాంప్ మూవీ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్న కిరణ్, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. గత కొన్నాళ్లుగా తన తర్వాతి సినిమాపై వినిపిస్తున్న వార్తలపై కిరణ్ క్లారిటీ ఇచ్చారు. కిరణ్ అబ్బవరం సినిమాకు సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారనేదే ఆ వార్త.
అనిరుధ్ తో భారీ ప్రాజెక్టు
ఈ విషయమై కిరణ్ ను అడగ్గా, తన కొత్త ప్రాజెక్టుకు అనిరుధ్ సంగీతం అందించనున్నారని, ఆ సినిమా చాలా భారీ స్కేల్ లో తెరకెక్కనుందని, తమిళ డైరెక్టర్ ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని, ఆ ప్రాజెక్టు కోసం అన్నీ రెడీగా ఉన్నాయని, ఇంతకంటే తాను ఇప్పుడేమీ చెప్పలేనని, ప్రొడక్షన్ టీమ్ నుంచి త్వరలోనే అనౌన్స్‌మెంట్ రానుందని కిరణ్ చెప్పారు.
కిరణ్ కెరీర్‌కు ఆ సినిమా పెద్ద బూస్టప్
అనిరుధ్ కు పాన్ ఇండియా స్థాయిలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. తన ఎనర్జిటిక్ ట్యూన్స్, ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే అనిరుధ్, కిరణ్ సినిమాకు వర్క్ చేయనుండటం నిజంగా చాలా పెద్ద విషయమే. ఈ అంశం కిరణ్ కెరీర్ కు బాగా ఉపయోగపడే అవకాశముందని, సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పుడు అనిరుధ్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేసే రేంజ్ కి వెళ్లడమంటే మామూలు మాటలు కాదని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఆ సినిమా తర్వాత కిరణ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లబోతున్నారని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా తమిళంలో తెలుగు సినిమాలను పెద్దగా ఆదరించరనే విషయానికి కూడా కిరణ్ ఆ ప్రాజెక్టుతో ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్సుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.