స్టార్ డైరెక్టర్ శిష్యుడితో అబ్బవరం
మరికొద్ది రోజుల్లో అది కూడా కంప్లీట్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే కిరణ్ లైనప్ లో ఇప్పటికే అనేక చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.;
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్.. వైవిధ్యమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రేక్షకులకు మెచ్చే కంటెంట్ ఇస్తూ ఓ రేంజ్ లో సందడి చేస్తూ అలరిస్తున్నారు.
గత ఏడాది క మూవీతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. అదే ఆయన కెరీర్ లో కీలక మలుపు అని చెప్పాలి. ఆ తర్వాత దిల్ రుబాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు వివిధ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. నాన్ స్టాప్ షూటింగ్స్ లో పాల్గొంటూ.. వరుసగా సినిమాల అప్డేట్స్ కూడా ఇస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో కె- ర్యాంప్ మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మరికొద్ది రోజుల్లో అది కూడా కంప్లీట్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే కిరణ్ లైనప్ లో ఇప్పటికే అనేక చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో ఇప్పుడు కిరణ్ అబ్బవరం వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఆయన దర్శకత్వంలో కాదు.. నిర్మాణంలో. వరుస సినిమాలు నిర్మిస్తున్న సుకుమార్ రైటింగ్స్ ఇప్పుడు కిరణ్ తో మూవీ తీయనుందట.
మంచి ఎంటర్టైనర్ గా సినిమా ఉండనుందని తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు వీర దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారని వినికిడి. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో ఆ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. మరికొద్ది రోజుల్లో సుకుమార్ రైటింగ్స్ సంస్థ.. కిరణ్ అబ్బవరం మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన చేయనందుట.
అయితే ఇప్పటికే వీర.. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప-2కు కూడా వర్క్ చేశారు. ఇప్పుడు కథను సిద్ధం చేసి ఇటీవల సుకుమార్ కు వినిపించారట. ఆయన ఓకే చెప్పాక.. కిరణ్ కు నెరేట్ చేశారని తెలుస్తోంది. అబ్బవరం కూడా స్టోరీని మెచ్చుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. ప్రస్తుతం సినిమా కోసం క్యాస్టింగ్ తో పాటు సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తున్నారట.