దీపావళి బాక్సాఫీస్: 'K-ర్యాంప్' మొదటి రోజు లెక్క ఎంతంటే..

టాలీవుడ్ లో ఈసారి దీపావళి సందర్భంగా డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.;

Update: 2025-10-19 08:10 GMT

టాలీవుడ్ లో ఈసారి దీపావళి సందర్భంగా డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక 'K-ర్యాంప్' చిత్రం పాజిటివ్ ప్రమోషన్ తో జనాలను ముందుగానే తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఇక విడుదల రోజే సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. సినిమా విడుదలైన మొదటి రోజు చాలా ఏరియాల్లో సందడి కనిపించింది, ఫైనల్‌గా ఆడియన్స్ తీర్పే ముఖ్యమని నమ్మిన టీమ్, ఇప్పుడు తమ సినిమా దీపావళి విన్నర్‌గా నిలిచిందని ధీమా వ్యక్తం చేస్తోంది.


ఈ మేరకు, చిత్ర నిర్మాతలు ఒక అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు. దాని ప్రకారం, 'K-ర్యాంప్' మూవీ విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ నంబర్‌తో, ఈ పండగ సీజన్‌లో తమ సినిమానే విజేతగా నిలిచిందని వారు ప్రకటించారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మేకర్స్ చెబుతున్న దాని ప్రకారం, సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో సాగే ఫస్టాఫ్, ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్‌తో కూడిన సెకండాఫ్‌ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని వారు తెలిపారు. మొదటి రోజు వచ్చిన ఈ ఊపు, పండగ సెలవుల్లో మరింత పెరిగి, బాక్సాఫీస్ వద్ద మరిన్ని మంచి నంబర్లను నమోదు చేస్తుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

కిరణ్ అబ్బవరం గతంలో కూడా దీపావళికి 'క' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను 'K-ర్యాంప్'తో రిపీట్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. కిరణ్ ఎనర్జీ, మాస్ అప్పీల్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయని, ముఖ్యంగా B, C సెంటర్లలో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించగా, నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.

మొత్తం మీద, రివ్యూలతో సంబంధం లేకుండా 'K-ర్యాంప్' మంచి ఓపెనింగ్‌ను అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ లాంగ్ వీకెండ్‌లో సినిమా ఇదే ఊపును కొనసాగిస్తుందా, లేక నెమ్మదిస్తుందా అనేది చూడాలి.

Tags:    

Similar News