'కే-ర్యాంప్' ఫస్ట్ లుక్: ఊర మాస్ లుక్‌లో కిరణ్ అబ్బవరం

ఇప్పుడు మరో యూనిక్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ‘కే-ర్యాంప్’ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.;

Update: 2025-06-30 05:31 GMT

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస హిట్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవలే ‘క’ అనే సినిమా ద్వారా బ్లాక్‌బస్టర్ అందుకున్న కిరణ్.. ఇప్పుడు మరో యూనిక్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ‘కే-ర్యాంప్’ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.


ఫస్ట్ లుక్‌లో కిరణ్ అబ్బవరం మాస్ గెటప్‌లో చొక్కా, లుంగీ ధరించి చిరునవ్వుతో స్టైల్‌గా ముందుకు నడుస్తూ కనిపిస్తున్నారు. వెనుకవైపు ఫైర్ ఎఫెక్ట్‌లతో తయారైన హార్ట్ షేప్ బాటిల్స్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోస్టర్ మొత్తం స్టైల్, ఫన్, ఫైర్ మూడూ కలగలిపినట్టుగా ఉండి సినిమా టోన్‌పై ఆసక్తిని పెంచింది. ఫస్ట్ లుక్‌తోనే అభిమానుల అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన తొలి చిత్రం కాగా.. కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే అందిస్తున్నారు. కిరణ్‌కు జోడిగా యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కూడా కిరణ్ న్యూ ఎనర్జీతో, మాస్ డైలాగ్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాడు. కే-ర్యాంప్ టైటిల్‌ను పోస్టర్ డిజైన్‌లో కూడా స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయడం విశేషం.

ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, చేతన్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా కావడం విశేషం. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాల్లో మ్యూజిక్ మంచి హిట్స్ అందుకుంది.

టెక్నికల్ టీమ్ విషయంలో కూడా కే-ర్యాంప్ ప్రత్యేకమే. సినిమాటోగ్రఫీని బాలాజీ గుట్టా, సతీష్ రెడ్డి మాసం హ్యాండిల్ చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్షన్ నుండి కాస్ట్యూమ్ వరకు ప్రతీ విభాగంలో స్పెషలిటి కనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతుండగా, మేకర్స్ దీపావళికి సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే, ‘కే-ర్యాంప్’ పోస్టర్‌తోనే మాస్ యూత్‌లో మంచి క్రేజ్ రాబట్టింది. కిరణ్ అబ్బవరం ఫాలోయింగ్ పెరుగుతోన్న సమయంలో ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేయడం విశేషం.

Tags:    

Similar News