కిరణ్ 'చెన్నై లవ్ స్టోరీ'.. హార్ట్ టచింగ్ గ్లింప్స్ చూశారా?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు వరుస సినిమాలు లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-06-02 17:56 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు వరుస సినిమాలు లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. క మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్.. ఆ తర్వాత దిల్ రుబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క సీక్వెల్ తో పాటు కే - ర్యాంప్ చేయనున్నారు. రీసెంట్ గా కే - ర్యాంప్ మూవీ స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


సెట్స్ లోని పిక్ కూడా షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అయింది. ఇప్పుడు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు కిరణ్ అబ్బవరం. సూపర్ హిట్ మూవీస్ కలర్ ఫోటో అండ్ బేబీ మేకర్స్ తో వర్క్ చేయనున్నారు. బేబీ నిర్మాత SKN నిర్మిస్తుండగా.. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ అందించిన కథతో రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.

గౌరీ ప్రియా హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా టైటిల్ ను రివీల్ చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. చెన్నై లవ్ స్టోరీ అనే క్రేజీ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. తొలి ప్రేమేం తోపు కాదు.. అంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.

అందమైన బీచ్ సీన్ తో గ్లింప్స్ స్టార్ట్ అయింది. హీరో హీరోయిన్లు బీచ్ ఒడ్డున కూర్చుని మాట్లాడుకుంటూ కనిపిస్తారు. 'బేబీ సినిమా చూశావా.. మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసులో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది.. ఫస్ట్ లవ్ గురించి చాలా బాగా రాసుకున్నాడు కదా.. రాలేదా.. ఫస్ట్ లవ్ ఫెయిల్ అయితే నరకం..' అని అంటుంది హీరోయిన్.

'మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే.. అందరి కథలు తల్లి ప్రేమ దగ్గర ఆగిపోవాలి కదా.. అమ్మే కదా మన ఫస్ట్ లవ్.. చరిత్రలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి..ఫస్ట్ లవ్ ఫెయిల్ అయితే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుంది.. ఒకే చోట కదలకుండా కూర్చుంటే కాలు తిమిరి ఎక్కుతుంది మనసు కూడా అంతే.. తొలి ప్రేమ తోపేం కాదు' అంటూ చెబుతారు కిరణ్. అలా గ్లింప్స్ ముగుస్తుంది.

అయితే గ్లింప్స్ చూస్తుంటే చెన్నైలో జరిగే లవ్ స్టోరీతో మరో కల్ట్ సినిమాను మేకర్స్ తీసుకురాబోతున్నారని క్లియర్ గా తెలుస్తోంది. గ్లింప్స్ లో ఉన్న డైలాగ్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. మణి శర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్యూటిఫుల్ గా ఉంది. కిరణ్ ఎప్పటిలానే ఇంప్రెసివ్ గా కనిపిస్తున్నారు. ఓవరాల్ గా గ్లింప్స్ అందరినీ మెప్పించి దూసుకుపోతోంది. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మరి చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News