ఉస్తాద్ అడ్డాలో విజయ్ కింగ్ డమ్!

సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, కింగ్‌డమ్ యూనిట్ ప్రమోషన్స్ మరింత వేగంగా నిర్వహిస్తోంది.;

Update: 2025-07-30 17:30 GMT

టాలీవుడ్ యూత్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్‌డమ్’ ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆకర్షిస్తోంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కీలక పాత్రలో మెరవనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. జూలై 31న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుండటంతో కింగ్‌డమ్ పై టాలీవుడ్‌లో మంచి బజ్ నెలకొంది.

స్పెషల్ ప్రెస్ మీట్‌

సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, కింగ్‌డమ్ యూనిట్ ప్రమోషన్స్ మరింత వేగంగా నిర్వహిస్తోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ బ్యాక్ డ్రాప్, కథ, టెక్నికల్ వర్క్ గురించి నటీనటులు, నిర్మాత నాగవంశీ మాట్లాడారు. విజయ్ దేవరకొండ ఈ చిత్రం తన కెరీర్‌లో మరో బిగ్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

పవన్ కల్యాణ్‌ను కలిసిన కింగ్‌డమ్ టీమ్

ఈ రోజునే కింగ్‌డమ్ టీమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ 7 ఎకరాల్లో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో ఈ సమావేశం జరిగింది. నిర్మాత నాగవంశీకి పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధంతోనే యూనిట్ పవన్‌ను కలిసిందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌తో కింగ్‌డమ్ మేకర్స్ స్పెషల్ గా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన స్పెషల్ విషెస్ తో టీమ్ అందరిని పలకరించినట్లు యూనిట్ సభ్యులు సోషల్ మీడియాలో తెలిపారు.

నైజాంలో స్పెషల్ ప్లాన్

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ప్రీమియర్స్ ప్లాన్ చేయకుండా, డైరెక్ట్ మాస్ రిలీజ్‌కే దృష్టి సారించిన కింగ్‌డమ్ టీమ్, అన్ని రీజియన్లలో భారీ ఓపెనింగ్స్ కోసం సిద్ధమైంది. నైజాంలో ఉదయం 7 గంటల నుంచే షోస్ మొదలు పెట్టడం, అడ్వాన్స్ బుకింగ్స్ బాగా ఉండడం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్, యూనిక్ కథాంశం మూడింటి మిక్స్‌తో కింగ్‌డమ్ ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసేలా కనిపిస్తోంది.

అందరి దృష్టి ఇప్పుడు కింగ్‌డమ్ పై ఉంది. విజయ్ దేవరకొండ మాస్ స్టామినా, యంగ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభ, సితార బ్యానర్ ప్రమోషన్స్ కలిసొచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఎలా ఆడుతుందో చూడాలి. మరికొన్ని గంటల్లో కింగ్‌డమ్ థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇక మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుతాయో చూడాలి.

Tags:    

Similar News