నాగార్జున దూకుడు బాగుందిగా..!
ఫైనల్ గా మళ్లీ మెస్వాక్ టూత్ పేస్ట్ యాడ్ లో సర్ ప్రైజ్ చేశారు. ఈ యాడ్ లో కూడా తన ఛార్మింగ్ లుక్ తో అదరగొట్టారు నాగార్జున.;
కింగ్ నాగార్జున రీసెంట్ గా కుబేర తో సూపర్ హిట్ కొట్టాడు. ధనుష్ లీడ్ రోల్ అయినా నాగార్జున మాత్రమే ఇలాంటి పాత్రలు చేయగలరు అనేలా చేశారు. శేఖర్ కమ్ముల మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడంతో కుబేర రిజల్ట్ విషయంలో నాగార్జున సూపర్ హ్యాపీగా ఉన్నాడు. ఐతే నా సామిరంగ హిట్ కొట్టినా సోలో సినిమా కోసం కింగ్ నాగార్జున టైం తీసుకుంటూనే ఉన్నాడు. ఐతే ఈలోగా కుబేర, కూలీ అంటూ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు.
కుబేర రిజల్ట్ ఎలాగు తెలిసింది.. ఇక నెక్స్ట్ కూలీలో నాగార్జున ఎలా కనిఒపిస్తాడా అని ఆడియన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఐతే ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క వాణిజ్య ప్రకటనలను కూడా చేస్తున్నాడు నాగార్జున. సీనియర్ స్టార్స్ లో నాగార్జున ఇప్పటికీ యాడ్స్ లో తన దూకుడు చూపిస్తున్నారు. అంతకుముందు కళ్యాణ్ జెవెలర్స్ కి బ్రాండింగ్ చేసిన నాగ్ ఈమధ్య మరో యాడ్ లో కనిపించలేదు.
ఫైనల్ గా మళ్లీ మెస్వాక్ టూత్ పేస్ట్ యాడ్ లో సర్ ప్రైజ్ చేశారు. ఈ యాడ్ లో కూడా తన ఛార్మింగ్ లుక్ తో అదరగొట్టారు నాగార్జున. ఓ పక్క తన తనయులు ఇద్దరు హీరోలుగా చేస్తున్నా కూడా గ్లామర్ విషయంలో నాగార్జున వాళ్లకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాడు. నాగార్జున స్టైలిష్ లుక్ ఇంకా ఆయన ఫిట్ నెస్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
లేటెస్ట్ గా వచ్చిన మెస్వాక్ యాడ్ లో కూడా నాగార్జున తన కూల్ లుక్స్ తో అదరగొట్టారు. కుబేర అయ్యింది.. కూలీ ఆగష్టులో వస్తుంది. వాటి పని పూర్తైంది కాబట్టి నాగార్జున ఇప్పటికైనా తన సోలో సినిమా కన్ ఫర్మ్ చేస్తారా లేదా అన్నది చూడాలి. నా సామిరంగ టైం లో ప్రతి సంక్రాంతికి ఒక సినిమా వచ్చేలా చూస్తానని ఫ్యాన్స్ కి మాట ఇచ్చిన నాగార్జున ఆ విషయాన్ని లైట్ తీసుకున్నట్టు ఉన్నారు.
ఐతే నాగార్జున చేసినట్టుగా మరో హీరో సినిమాలో డిఫరెంట్ రోల్ అది కూడా తన ఇమేజ్ గురించి ఆలోచించకుండా చేయడం లాంటిది గొప్ప విషయమని చెప్పొచ్చు. అందుకే ఆయన పంథాలోనే మరికొంతమంది సీనియర్ స్టార్స్ వెళ్లాలని చూస్తున్నారు.