వార్ 2 : ఆమె ఇమేజ్ డ్యామేజ్ కంట్రోల్ అయినట్లేనా?
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. హృతిక్ రోషన్‌కి జోడీగా కియారా అద్వానీ నటించింది.;
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ 'వార్ 2' ఈ ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ నటించాడు. సూపర్ హిట్ మూవీ 'వార్' కి సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. వార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే వార్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. గతంలో ఎప్పుడూ ఏ బాలీవుడ్ మూవీకి లేని బజ్ ఈ సినిమాకు క్రియేట్ అయింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. హృతిక్ రోషన్‌కి జోడీగా కియారా అద్వానీ నటించింది. ఈ సినిమాలో కియారా అద్వానీ పాత్ర గురించి మొదటి నుంచి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. టీజర్ విడుదల తర్వాత సినిమాపై ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా టీజర్‌లో కియారా అద్వానీ బికినీ షార్ట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. రామ్ గోపాల్ వర్మ వంటి స్టార్ కూడా వార్ 2 లో కియారా అద్వానీ బికినీ ట్రీట్ కోసం అయినా చూడొచ్చు అంటూ కామెంట్ చేశాడు. టూ పీస్ బికినీలో కియారా అద్వానీ లుక్‌కి అంతా ఫిదా అయ్యారు. సినిమాలో ఆమె పాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టీజర్‌లో కియారా అద్వానీని బికినీలో చూపించడంతో అంతా కూడా సినిమా మొత్తం ఆమె గ్లామర్ డాల్‌గానే కనిపించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇలాంటి స్టార్ హీరోల మల్టీస్టారర్ సినిమాల్లో కచ్చితంగా హీరోయిన్స్‌కి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. కియారా అద్వానీ విషయంలోనూ అదే జరగడం ఖాయం అనుకున్నారు. కానీ వార్ 2 లో కియారా అద్వానీ వేసిన పాత్ర కూరలో కరివేపాకు పాత్ర కాదట. ఆమె యాక్షన్ సన్నివేశాల్లోనూ కనిపించబోతుందట. ఏకంగా ఇద్దరు హీరోల్లో ఒక హీరోతో ఈమె ఫైట్ ఉంటుందని అంటున్నారు. ఆ హీరో ఎవరు అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజాగా సినిమా 50 రోజుల్లో విడుదల కాబోతుంది అంటూ కౌంట్ డౌన్ షురూ చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీల ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోల్లో కియారా అద్వానీ యాక్షన్ మూడ్‌లో ఉంది. బ్లాక్ డ్రెస్‌లో కియారా అద్వానీ గన్ పట్టుకుని కనిపించింది. చాలా పవర్ ఫుల్ పాత్రలో కియారా అద్వానీ కనిపించబోతుంది అంటూ ఈ పోస్టర్‌తో మేకర్స్ చెప్పే ప్రయత్నం చేశారు. బికినీ వీడియో తర్వాత కియారా అద్వానీ పాత్ర గురించి అయిన డ్యామేజీని కంట్రోల్ చేసే విధంగ ఆ ఈ ఫోటో ఉంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. కియారా అద్వానీ కచ్చితంగా ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా నటిగానూ మంచి పేరు తెచ్చుకుంటుంది అనే విశ్వాసంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.