నా బోల్డ్ సీన్స్ కట్ చేయండి.. రిక్వెస్ట్ చేస్తున్న స్టార్ బ్యూటీ!

ఇక ఈ సినిమాలో హీరో యశ్ తో ఆమె చేసిన బోల్డ్ సీన్ల రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్స్ లో ఈమె ప్రదర్శన చూసి అందరూ ఆశ్చర్యపోయారు.;

Update: 2026-05-03 06:58 GMT

కథ డిమాండ్ చేస్తే హీరోయిన్స్ ఎలాంటి పాత్రలోనైనా నటించాల్సిందే అనే కామెంట్లు ఎప్పటికప్పుడు వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే యాక్షన్ పెర్ఫార్మెన్స్ అయితే ఓకే కానీ బోల్డ్ సన్నివేశాలు చేసేటప్పుడు హీరోయిన్స్ కూడా కాస్త ఆలోచించి చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఒక హీరోయిన్ కథ డిమాండ్ మేరకు సినిమాలో బోల్డ్ గానే నటించింది. కాకపోతే ఆ సన్నివేశాలను తెరపై చూసేసరికి ఆమె వాటిని జీర్ణించుకోలేక పోయిందట. అందుకే తన బోల్డ్ సీన్స్ ను కట్ చేయండి అంటూ దర్శకురాలిని ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆమె ఏ సినిమాలో నటించింది ? ఎందుకు ఇప్పుడు బోల్డ్ సీన్స్ కట్ చేయమని అడుగుతోంది ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

 

ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత వినయ విధేయ రామ అనే సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత చేసిన గేమ్ చేంజర్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక దీంతో తెలుగులో మళ్లీ అవకాశాలు అందిపుచ్చుకోలేదు. ప్రస్తుతం కన్నడ హీరో యశ్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరో యశ్ తో ఆమె చేసిన బోల్డ్ సీన్ల రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్స్ లో ఈమె ప్రదర్శన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన హీరోయిన్ కియారా అద్వానీ కొంత అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కథ డిమాండ్ మేరకు చిత్రీకరించిన కొన్ని బోల్డ్, ఇంటిమేట్ సీన్లు వెండితెరపై మరీ ఎక్కువగా ఉన్నాయని ఆమె భావిస్తోందట. నిజానికి కియారా అద్వానీ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి , పిల్లల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ లో తనను రిసీవ్ చేసుకునే విధానం కూడా మారుతోందని భావించిన ఈమె.. ఆ సీన్లను పూర్తిగా తొలగించాలని.. లేదా వాటి నిడివిని అయినా తగ్గించాలని దర్శకురాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై దర్శకురాలు మాత్రం.. ఆ సీన్లు కథలో అంతర్భాగమని.. వాటిని తీసేస్తే సినిమా ఇంపాక్ట్ దెబ్బతింటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. మరి మొత్తానికైతే టాక్సిక్ టీమ్ కియారా అభ్యర్థనలను మన్నిస్తుందా లేదా అన్నది ఇప్పుడు సినిమా విడుదల అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే. ఇకపోతే జూన్ 4వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు యశ్.

Tags:    

Similar News