టాలీవుడ్ ఎంట్రీ కోసం చిన్న సుందరి ప్రయత్నాలు
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాల్లుగా ఆమె ఇద్దరు కుమార్తెలు అయిన జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌లు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాల్లుగా ఆమె ఇద్దరు కుమార్తెలు అయిన జాన్వీ కపూర్, ఖుషి కపూర్‌లు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. శ్రీదేవి బతికి ఉన్న సమయంలోనే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మొదటి సినిమా సైన్ చేసింది. షూటింగ్ సైతం ప్రారంభం అయింది. కానీ దురదృష్టవశాత్తు జాన్వీ కపూర్ మొదటి సినిమా విడుదలకు ముందే శ్రీదేవి చనిపోయింది. కూతురు తెరంగేట్రం చేసిన సినిమా ను శ్రీదేవి చూసుకోలేక పోయారు. జాన్వీ కపూర్‌తో పాటు ఖుషి కపూర్‌ను సైతం హీరోయిన్‌గా పరిచయం చేయాలని శ్రీదేవి భావించేదట. శ్రీదేవి చనిపోయే కాలం నాటికి ఖుషి కపూర్ హీరోయిన్‌గా పరిచయం కాలేదు, కానీ ఇండస్ట్రీలో మాత్రం భాగం అయ్యింది. ఒకటి రెండు సినిమాలకు అసోషియేట్‌గా వర్క్ చేసింది. కొన్ని వెబ్ సిరీస్‌కు సంబంధించి వర్క్ చేసింది.
ఖుషి కపూర్ హీరోయిన్గా...
ఖుషి కపూర్‌కి సినిమాలపై చాలా ఆసక్తి ఉండేదట. అందుకే నటిగా కంటే ముందు సినిమాల గురించి లోతుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అసోషియేట్ డైరెక్టర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసింది. ఖుషి కపూర్ బాలీవుడ్‌లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చింది. 2023లో ది ఆర్చీస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఖుషి కపూర్ ఆ వెంటనే లవ్‌యాపా సినిమాలో జునైద్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. కానీ లక్ కలిసి రాకపోవడంతో ఖుషి కపూర్‌కి కమర్షియల్ బ్రేక్ దక్కలేదు. ఇప్పటి వరకు ఖుషి నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. బాలీవుడ్‌లో హిట్ అయితే టాలీవుడ్‌కి ఖుషి కపూర్ జంప్ అవ్వాలని చూస్తుంది. ఇప్పటి వరకు బాలీవుడ్‌లోనే ఈమెకు సరైన ఆఫర్లు రావడం లేదు. అయితే శ్రీదేవి కూతురు కావడంతో ఖుషి కపూర్‌కి టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ కు జోడీగా ఖుషి కపూర్..
ఆ మధ్య రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' సినిమాలో ఖుషి కపూర్ ను హీరోయిన్‌గా అనుకున్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన పెద్ది సినిమాలో మొదట ఆ పాత్రకు గాను ఖుషి కపూర్‌ను దర్శకుడు బుచ్చిబాబు పరిశీలించాడట. అయితే రామ్ చరణ్ కు జోడీగా ఖుషి కపూర్ సెట్ కాదనే ఉద్దేశంతో, ఇద్దరి మధ్య వయసు తేడా ఎక్కువగా కనిపిస్తుందనే ఉద్దేశంతో నిర్మాతలు వెనకడుగు వేశారని తెలుస్తోంది. రామ్ చరణ్ కు జోడీగా చివరకు జాన్వీ కపూర్ నటించడం, సినిమాకు మంచి స్పందన రావడం, జాన్వీ పాత్రకు విమర్శలు రావడం తెలిసిందే. పెద్ది కి మాత్రమే కాకుండా మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అనుకున్న సినిమాకు గాను ఖుషి కపూర్ ను హీరోయిన్‌గా అనుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయిన విషయం తెల్సిందే.
జాన్వీ కపూర్ రేంజ్‌లో వరుస సినిమాలు..
ఖుషి కపూర్ కు టాలీవుడ్ నుంచి ఇప్పటికీ ఆఫర్లు తలుపు తడుతూనే ఉంటాయి. అయితే ఆమె మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది. మొదటి సినిమా స్టార్ హీరోతో అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఖుషి కపూర్ వెయిట్ అండ్ సీ అన్నట్లుగా వ్యవహరిస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. బాలీవుడ్‌లో అనుకున్న స్థాయిలో హిట్ రాకపోవడంతో టాలీవుడ్‌లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తుంది. చిన్న చిన్న సినిమాల్లో ఖుషి కి ఛాన్స్ వస్తున్నాయట. కానీ ఖుషి మాత్రం పెద్ద సినిమాలను దృష్టిలో పెట్టుకుని వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మాదిరిగా ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ వంటి పెద్ద హీరోలతో సినిమా చేస్తే కచ్చితంగా కెరీర్ బాగుంటుంది. అందుకే ఖుషి కపూర్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. టాలీవుడ్‌లో దేవర, పెద్ది సినిమాలతో జాన్వీ కపూర్‌కి మంచి డిమాండ్ పెరిగింది. మరికొన్ని స్టార్ హీరోల సినిమాల్లో జాన్వీ కపూర్ నటించే అవకాశం ఉంది. అలాగే ఖుషి కపూర్ సైతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్‌లో పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటుందా అనేది చూడాలి.