పూరి జ‌గ‌న్నాధ్ లా బ్ర‌త‌క‌డం నేర్చుకున్న బుచ్చిబాబు!

పరిశ్రమలో దర్శకుడు పూరి జగన్నాథ్ తనదైన శైలిలో? ఏమాత్రం సంకోచం లేకుండా జీవించే వ్యక్తిగా గుర్తింపు పొందారు.

Update: 2026-07-06 09:30 GMT

పరిశ్రమలో దర్శకుడు పూరి జగన్నాథ్ తనదైన శైలిలో? ఏమాత్రం సంకోచం లేకుండా జీవించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆ ధోరణికి ప్రభావితమైన దర్శకుడు బుచ్చిబాబు సానా జీవితం పట్ల ఓ కొత్త అర్థాన్ని వెతుక్కున్నారు. సంపాదన, హోదా కంటే ప్రస్తుత క్షణాన్ని ఎంత ఆనందంగా గడుపుతున్నామన్నదే ముఖ్యమని బుచ్చి సైతం గ్రహించారు. ఈ పరిణితి వెనుక ఓ భావోద్వేగపూరితమైన అనుభవం ఉంది. ఒకానొక సమయంలో బుచ్చిబాబుకు ఒక నిర్మాత బెంజ్ కారును కానుకగా ఇస్తానని చెప్పారు. అప్పుడు ఆయనకు కారు కంటే డబ్బు ముఖ్యమని, భవిష్యత్తు కోసం ఆ డబ్బును పొదుపు చేసుకోవచ్చని అనిపించింది.

కానీ అతి క‌ష్టంతో బెంజ్ కారును తీసుకున్నారు. ఆ కారులో తన తండ్రిని కూర్చోబెట్టి ఆయనకు ఇష్టమైన చోట తిప్పడం అప్పటికి ఆయనకు సాధారణ విషయంగానే అనిపించింది. దురదృష్టవశాత్తు ఆ సంఘటన జరిగిన కొద్ది కాలానికే బుచ్చిబాబు తండ్రి మరణించారు. ఆ సమయంలోనే బుచ్చిబాబులో తీవ్రమైన మార్పు మొదలైంది. తాను సంపాదించిన డబ్బుతో కారు కొన్నప్పుడు లేదా విలాసాలను అనుభవించినప్పుడు అవి తనకిచ్చిన ఆనందం కంటే తన తండ్రికి ఆ సంతోషాన్ని పంచడం ఎంత విలువైనదో? అర్థమైంది. అప్పటి వరకు బుచ్చిబాబులో ఉన్న సంకుచిత భావాలు ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి.

చాలామంది రేపు అనే అస్పష్టమైన భవిష్యత్తు కోసం నేటిని త్యాగం చేస్తుంటారు. డబ్బు కూడబెట్టడం, పొదుపు చేయడం అవసరమే అయినా ఆ క్రమంలో జీవితాంతం పక్కన ఉండని వ్యక్తుల పట్ల చూపించాల్సిన ప్రేమను, అందించాల్సిన ఆనందాన్ని మర్చిపోతుంటామని బుచ్చిబాబు గ్రహించారు. కాలం ఎవరి కోసం ఆగదని ఉన్నప్పుడే మనుషులతో నాణ్యమైన సమయాన్ని గడపడం అన్నింటికంటే గొప్ప పెట్టుబడి అని బుచ్చిబాబు అభిప్రా య‌ప‌డ్డారు. పూరి జగన్నాథ్ లాంటి వారు తమ సంపాదనను దాచుకోకుండా జీవితంలోని ప్రతి ఘట్టాన్ని అనుభవిస్తూ జీవిస్తారు.

అదే విషయాన్ని ఇప్పుడు బుచ్చిబాబు తన జీవితానికి అన్వయించు కుంటున్నారు. తన కష్టం వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యం బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు. తన కుటుం బంతో, తన ఆత్మీయులతో సంతోషకరమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడమేనని బుచ్చి బలంగా నమ్ముతున్నారు. జీవితం చాలా చిన్నదని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితిలో ఉన్నామని బుచ్చిబాబు అనుభవం చెబుతోంది. రేపటి కోసం ఆరాటపడి నేటిని వృధా చేసుకోవడం కంటే గడిచే ప్రతి క్షణాన్ని సంతోషంగా, ఉల్లాసంగా గడపడమే నిజమైన జీవన కళ. తన తండ్రికి కల్పించిన ఆ చిన్న ఆనందమే తనకు జీవితాంతం గుర్తుండిపోయే అతిపెద్ద ఆస్తి అని బుచ్చిబాబు గుర్తించారు.

Tags:    

Similar News