పాన్ సౌత్ టార్గెట్‌తో సియోన్!
శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం సియోన్‌పై మరోసారి సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం సియోన్‌పై మరోసారి సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొన్న సమయంలో, ప్రముఖ కన్నడ నటుడు రాజ్ బి శెట్టి ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం కొత్త హైప్‌కు కారణమైంది. కోలీవుడ్ లో ఆయన తొలి అడుగు వేయడం కూడా ఈ అనౌన్స్‌మెంట్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇటీవలి కాలంలో భాషల మధ్య ఉన్న గోడలు క్రమంగా తగ్గిపోతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన నటీనటులు పరస్పరం ఒకరి సినిమాల్లో మరొకరు నటిస్తూ పాన్ సౌత్ మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే సియోన్ టీమ్ కూడా వివిధ భాషల్లో గుర్తింపు ఉన్న నటులను ఎంపిక చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా సౌత్ ఆడియన్స్ ను ఆకర్షించే దిశగా ఈ సినిమా అడుగులు వేస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
శివకార్తికేయన్ కెరీర్ పరంగా కూడా ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. శివ కార్తికేయన్ గత సినిమాల ఫలితాల తర్వాత బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ సక్సెస్ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి టైమ్ లో గ్రామీణ నేపథ్యంతో, స్థానిక భావోద్వేగాలను ప్రతిబింబించే కథలో నటించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. గతంలో ఇలాంటి కథలతో ఆయన అందుకున్న సక్సెస్‌లను గుర్తు చేసుకుంటున్నఫ్యాన్స్, సియోన్ మరోసారి ఆ తరహా మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఎక్కువ డిస్కషన్ కు కారణమవుతున్న విషయం రాజ్ బి శెట్టి ఈ సినిమాలో నటిస్తుండటం. నటుడిగానే కాకుండా రైటర్ గా, డైరెక్టర్ గా కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనే అభిప్రాయం సినీ వర్గాల్లో బలంగా ఉంది. అందుకే ఆయన ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారంటేనే కథలో బలమైన అంశాలు ఉండి ఉంటాయనే అంచనాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ఇది ఫ్యాన్స్ ఒపీనియన్ మాత్రమే. సినిమా కథపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం ఇంకా బయటకు రాలేదు.
సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి రిలీజవుతున్న ప్రతి అప్‌డేట్ అందరికీ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతోంది. నటీనటుల ఎంపిక నుంచి టెక్నికల్ టీమ్ వరకు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు రాజ్ బి శెట్టి చేరికతో ఆ డిస్కషన్ మరింత పెరిగింది. ఒక బలమైన కథ, విభిన్న నటీనటుల కలయిక, పాన్ సౌత్ ఎట్రాక్షన్ కలిగిన క్యాస్టింగ్, శివకార్తికేయన్‌కు అత్యంత కీలకమైన దశలో వస్తున్న సినిమా అనే అంశాలు సియోన్ ను ఇప్పటికే చర్చనీయాంశంగా మార్చేశాయి. రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుంటుందన్నది ఇప్పుడు ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తికరంగా మారింది.