బీచ్ సన్‌సెట్‌కు మరింత గ్లామ్ జోడించిన అనన్య పాండే
ఆమె ఒక స్లీక్ బ్లాక్ బాడీసూట్‌ను ధరించి దానికి కాంబినేషన్‌గా బోల్డ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ ప్యాటర్న్ ఉన్న మినీ ర్యాప్ స్కర్ట్‌ను మ్యాచ్ చేసింది.
బాలీవుడ్ యంగ్ సెన్సేషన్, జెన్-జీ ఐకాన్ అనన్య పాండే తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సముద్ర తీరాన, సూర్యాస్తమయ సమయం గోల్డెన్ అవర్ లో ఆమె దిగిన కొన్ని స్టన్నింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గ్లామర్, ఎలిగాన్స్ కలబోసినట్లున్న ఈ సన్‌సెట్ లుక్‌లో అనన్య ఎనర్జీ మరియు స్టార్ క్వాలిటీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ బ్యూటిఫుల్ లుక్ విశేషాలు మీకోసం.
అదిరిపోయే అవుట్‌ఫిట్.. సమ్మర్ గ్లామర్:
ఈ ఫొటోషూట్‌లో అనన్య పాండే స్టైలింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఆమె ఒక స్లీక్ బ్లాక్ బాడీసూట్‌ను ధరించి దానికి కాంబినేషన్‌గా బోల్డ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ ప్యాటర్న్ ఉన్న మినీ ర్యాప్ స్కర్ట్‌ను మ్యాచ్ చేసింది. సముద్రపు గాలికి ఎగురుతున్న జుట్టు, ముఖంపై ఒక అందమైన చిరునవ్వు, ఒక చేతితో మెడను తాకుతూ ఆమె ఇచ్చిన కాన్ఫిడెంట్ పోజ్ యూత్‌ఫుల్ సమ్మర్ గ్లామర్‌ను పర్‌ఫెక్ట్‌గా ప్రతిబింబిస్తోంది. బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న సముద్రం, సూర్యాస్తమయ కాంతులు ఆమె అందాన్ని మరింత పెంచేశాయి.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ నుండి క్రేజీ స్టార్ వరకు:
2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో టైగర్ ష్రాఫ్ సరసన బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఫస్ట్ సినిమాతోనే తన నటనతో, క్యూట్ లుక్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత పతి పత్ని ఔర్ వో, ఖాలీ పీలీ, నెట్‌ఫ్లిక్స్ హిట్ సిరీస్ ‘కాల్ మీ బే’ వంటి చిత్రాలతో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించింది. ముఖ్యంగా 2023 లో వచ్చిన ‘ఖో గయే హమ్ కహా’ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
సోషల్ మీడియా క్వీన్.. చేతినిండా ప్రాజెక్టులు:
అనన్య పాండే కేవలం సినిమాలతోనే కాకుండా తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్, క్రేజీ డాన్స్ నంబర్లతో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక విజయ్ దేవరకొండ రాబోయే 'రౌడీ జనార్థన' చిత్రంలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారని టాక్.
ఫ్యాషన్ ఐకాన్‌గా అనన్య మార్క్:
సముద్ర తీరాన అనన్య పాండే చేసిన ఈ సన్‌సెట్ హడావిడి నెటిజన్లకు ఫుల్ విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు. గ్లామరస్ అవుట్‌ఫిట్‌లోనూ ఎంతో కేర్‌ఫ్రీగా, రేడియంట్‌గా కనిపిస్తూ ఫ్యాషన్ ప్రియులకు సరికొత్త గోల్స్ సెట్ చేసింది. అటు సినిమాలతో, ఇటు ఇలాంటి స్టైలిష్ ఫొటోషూట్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే అనన్య.. రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి..