కల్కి 2: ఇంకెంత భారీ క్యాస్టింగ్ ఉండనుందో..

కల్కి 2898 ఏడీ ఫస్ట్ పార్ట్ లోనే మూవీ లవర్స్ ఆశ్చర్యపోయే స్థాయిలో భారీ క్యాస్టింగ్ ను రంగంలోకి దించారు దర్శకుడు నాగ్ అశ్విన్.

Update: 2026-07-06 10:54 GMT

కల్కి 2898 ఏడీ ఫస్ట్ పార్ట్ లోనే మూవీ లవర్స్ ఆశ్చర్యపోయే స్థాయిలో భారీ క్యాస్టింగ్ ను రంగంలోకి దించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీతో పాటు క్యామియో రోల్స్ లో పలువురు స్టార్లు సందడి చేశారు. ఇప్పుడు సీక్వెల్ విషయంలో వినిపిస్తున్న పేర్లు చూస్తుంటే.. కల్కి 2లో ఇంకెంత భారీ కాస్టింగ్ ఉండనుందనే ఆసక్తి మొదలైంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ భారీ విజయాన్ని అందుకుంది. పురాణాలను ఫ్యూచర్ వరల్డ్ తో లింక్ చేస్తూ రూపొందించిన ఆ సినిమా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ లో ప్రభాస్ పాత్రకు కర్ణుడితో ఉన్న రిలేషన్ ను చూపించడంతో సీక్వెల్‌ పై అంచనాలు మరింత పెరిగాయి.

కల్కి 2లో ప్రభాస్‌ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలకు మరింత ఇంపార్టెన్స్ ఉండనుంది. కమల్ హాసన్ రోల్ అసలు కథ అంతా రెండో భాగంలో మొదలవుతుందనే విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మధ్య జరిగే కథే సీక్వెల్‌ కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అయితే ఇప్పటికే ఉన్న భారీ క్యాస్టింగ్ కు మరికొందరు స్టార్లు తోడవుతున్నారనే ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పేరు కొంతకాలంగా వినిపిస్తోంది.

కల్కి 2లో ఆమె ఓ పవర్‌ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొణె సీక్వెల్‌ లో లేకపోవడంతో.. ఆ రోల్ లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ప్రియాంక చోప్రా, సాయిపల్లవి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆలియా పేరు వినిపిస్తోంది. అయితే ఆమె సుమతి పాత్రలో కనిపిస్తారా? లేక నాగ్ అశ్విన్ ఆమె కోసం కొత్త పాత్రను సిద్ధం చేశారా? అనే విషయంలో క్లారిటీ లేదు.

మరోవైపు కల్కి 2లో కర్ణుడి కుమారుడు వృషసేనుడి పాత్ర కూడా ఉండొచ్చని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఆ పాత్ర కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరో కొడుకును తీసుకున్నారనే వినికిడి. ఆ నటుడు ఎవరనేది ఇంకా బయటకు రాకపోయినా.. ఆ వార్త మాత్రం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. తొలి భాగం క్లైమాక్స్‌ లో కర్ణుడి ప్రస్తావన కీలకంగా మారడంతో.. సీక్వెల్‌ లో ఆయనకు సంబంధించిన కథను మరింత చూపించే అవకాశముందని తెలుస్తోంది.

ఇక కల్కి 2లో కొన్ని గెస్ట్ రోల్స్ కూడా ఉండనున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ పార్ట్ లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్లు కనిపించి ఆశ్చర్యపరిచారు. రెండో భాగంలోనూ అదే తరహాలో మరికొందరు ప్రముఖ నటులను రంగంలోకి దించే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కల్కి2 కథతో పాటు క్యాస్టింగ్ విషయంలోనూ భారీగానే ఉండబోతున్నట్లు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. మరి అవన్నీ నిజమైతే.. కల్కి 2లో నాగి ఇంకెంత భారీ క్యాస్టింగ్ ను రంగంలోకి దించుతారో చూడాలి.

Tags:    

Similar News