లేటెస్ట్ సెల్ఫీలో ఖుషీ కపూర్ గ్లామ్ షో.. సోషల్ మీడియాలో వైరల్!
తాజా మిర్రర్ సెల్ఫీ కోసం ఖుషీ కపూర్ ఒక క్యూట్ బ్లాక్ పోల్కా-డాట్ హాల్టర్ క్రాప్ టాప్‌ను ఎంచుకుంది.
టాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె, బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్ తాజాగా పోస్ట్ చేసిన స్టైలిష్ మిర్రర్ సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అల్ట్రా మోడర్న్ లుక్‌లో, క్యూట్ అండ్ హాట్ పోజులతో ఆమె అలరించిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది, తన ఫ్యాషన్ సెన్స్‌తో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటోంది. ప్రస్తుతం ఖుషీ పంచుకున్న ఈ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..
ప్యాటర్న్డ్ డ్రెస్‌లో క్యూట్ అండ్ బోల్డ్ లుక్ :
తాజా మిర్రర్ సెల్ఫీ కోసం ఖుషీ కపూర్ ఒక క్యూట్ బ్లాక్ పోల్కా-డాట్ హాల్టర్ క్రాప్ టాప్‌ను ఎంచుకుంది. నడుము భాగాన్ని, టోన్డ్ ఫిజిక్‌ను చూపిస్తూ ఉన్న ఈ టాప్‌కు చిన్న బొ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక దీనికి జతగా మ్యాచింగ్ ప్లీటెడ్ మినీ స్కర్ట్ ధరించి, చేతిలో రెడ్ ఫోన్ పట్టుకుని ఆమె ఇచ్చిన పోజ్ కేక పుట్టిస్తోంది. ఇక జుట్టును వెనక్కి హై పోనీటైల్‌గా ముడివేసి, చేతిపై ఉన్న టాటూలు తెలిసేలా ఆమె ఇచ్చిన లుక్ పిక్సెల్ పర్‌ఫెక్ట్‌గా ఉంది.
'సాఫ్ట్ సర్వ్' వైబ్స్‌తో క్యాప్షన్ రచ్చ:
ఈ పిక్స్‌తో పాటు అథ్లేజర్‌తో కలిసి ఆమె కో-క్రియేట్ చేసిన మెంట్ గ్రీన్ కలర్ 'సాఫ్ట్ సర్వ్' కలెక్షన్ డ్రెస్సుల ఫోటోలను కూడా పంచుకుంది. ఇక "గేమ్స్, గెయిన్స్, డాగ్స్ అండ్ సాఫ్ట్ సర్వ్‌తో ఒక వారం " అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు "సో క్యూట్", "గార్జియస్", "గ్లామర్ క్వీన్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ లైకులతో ముంచెత్తుతున్నారు.
'ది ఆర్చీస్' నుంచి 'మామ్ 2' వరకు :
న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందిన ఖుషీ కపూర్, జోయా అక్తర్ రూపొందించిన నెట్‌ఫ్లిక్స్ మ్యూజికల్ ఫిల్మ్ 'ది ఆర్చీస్' ద్వారా బెట్టీ కూపర్‌గా వెండితెరకు పరిచయమైంది. ఇక ఆ తర్వాత 'లవ్యాపా', 'నాదానియాన్' వంటి రొమాంటిక్ కామెడీ చిత్రాలతో అలరించిన ఈ భామ, ప్రస్తుతం తన తల్లి శ్రీదేవి నటించిన ఐకానిక్ సినిమా సీక్వెల్ 'మామ్ 2' థ్రిల్లర్ చిత్రంతో థియేటర్లలోకి రాబోతోంది.
స్టార్ వారసత్వాన్ని నిలబెడుతూ :
సొంతంగా తనదైన ముద్ర వేసుకునేందుకు కష్టపడుతున్న ఖుషీ, వైవిధ్యమైన సినిమాలతో పాటు సోషల్ మీడియా గ్లామర్‌తోనూ క్రేజ్ పెంచుకుంటోంది. బోల్డ్ అండ్ క్లాసీ లుక్స్‌తో బాలీవుడ్ యంగ్ జనరేషన్ ఫ్యాషన్ ఐకాన్‌గా మారుతోంది. ఇక తన క్యూట్ స్మైల్, బోల్డ్ అవుట్‌ఫిట్లతో ఇంటర్నెట్‌లో గ్లామ్ షో చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్న ఖుషీ కపూర్, రాబోయే రోజుల్లో వెండితెరపై మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.