ఖుష్బూ ఇంట మోగనున్న పెళ్లి భాజాలు.. కాబోయే అల్లుడితో మోదీకి స్పెషల్ ఇన్విటేషన్!
ఈ విషయాన్ని ఖుష్బూ తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా భారత ప్రధాని మోధీకి ధన్యవాదాలు తెలియజేశారు.
చిత్ర పరిశ్రమలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ప్రముఖ సీనియర్ హీరోయిన్, అందాలతార బీజేపీ నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఈ మేరకు ఆమె తన భర్త, ప్రముఖ డైరెక్టర్ సుందర్ సి తో కలిసి తన కూతురు, కాబోయే అల్లుడుతో భారత ప్రధాని మోదీని కలిసి.. సగౌరవంగా తమ కూతురి పెళ్లికి ఆహ్వానిస్తూ వివాహ పత్రికను అందజేశారు. ఈ విషయాన్ని ఖుష్బూ తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా భారత ప్రధాని మోధీకి ధన్యవాదాలు తెలియజేశారు.
ఖుష్బూ కూతురి పెళ్లి.. మోదీకి ప్రత్యేక ఆహ్వానం..
ఖుష్బూ తన ఎక్స్ ఖాతా ద్వారా తన భర్త సుందర్ సి, కుమార్తె అవంతిక, ఆమెకు కాబోయే భర్త శ్రవణ్ శ్రీనివాసన్ తో భారత ప్రధాని మోదీని కలిశారు. ఇక తమ కూతురు అవంతిక వివాహానికి రావాలి అని శుభలేఖను అందజేశారు. ఈ ఫోటోలను ఖుష్బూ షేర్ చేస్తూ.." ఈరోజు ఢిల్లీలో భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలుసుకునే అదృష్టం మాకు లభించింది. శ్రవణ్ శ్రీనివాసన్ తో త్వరలో జరగబోయే మా కుమార్తె అవంతిక వివాహానికి నా భర్త సుందర్, నేను కలిసి ఆయనకు ఆహ్వానం అందించాము. ప్రైమ్ మినిస్టర్ గారు కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఆయన తన బిజీ షెడ్యూల్లో కూడా మాకు సమయం కేటాయించినందుకు మేము నిజంగా కృతజ్ఞులమై ఉన్నాము. మేము ఆయనకు ఎంతో రుణపడి ఉంటాము. వినమ్రతతో తలవంచుతున్నాము.. ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు" అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొత్తానికైతే ఖుష్బూ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయని తెలిసి అభిమానులు కాబోయే నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఖుష్బూ పిల్లల విషయానికి వస్తే.. ఇద్దరు కుమార్తెలు.
పెద్ద కుమార్తె ఆనందిత.. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే చిన్న కూతురు అవంతిక కూడా త్వరలోనే అరంగేట్రం చేయనున్నారు. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఆరంభం అనే చిత్రం ద్వారా ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అంతేకాదు ధనుష్ మేనల్లుడు పావిష్ నారాయణ్ తో కలిసి అవంతిక తమిళంలో ఒక స్పోర్ట్స్ డ్రామా ట్రైలర్ మూవీ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో లేదో.. ఇంకా ఒక సినిమా కూడా తెరపైకి రాలేదు అప్పుడే వైవాహిక బంధం లోకి అవంతిక అడుగుపెడుతోంది. మొత్తానికైతే అవంతిక పెళ్లి పీటలు ఎక్కబోతోందని తెలిసి అభిమానులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అవంతిక వివాహం తర్వాత కూడా సినిమాలలో కంటిన్యూ చేస్తుందా లేక కుటుంబానికి మొదటి ప్రయారిటీ ఇస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.