ఖుష్బూ ఐటెం సాంగ్‌ కౌంటర్‌... మీ ఫ్యామిలీ వాళ్లే అయ్యి ఉంటారు!

అయితే సినిమా ప్రకటన వచ్చిన రెండు మూడు రోజుల్లోనే దర్శకుడు సుందర్‌ సి తాను ఆ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించబోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.;

Update: 2025-11-24 11:30 GMT

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ల కలయికలో ఒక సినిమా రాబోతుంది అనే ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి కమల్‌ హాసన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధం అయ్యాడు. మొదట ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్‌ ను అనుకున్నారు. కూలీ సినిమా ఫలితం నేపథ్యంలో ఆయనను తప్పించారు. ఆయన ఈ సినిమాకు న్యాయం చేయలేడు అని కమల్‌ భావించాడు అంటూ తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పటికే స్టోరీ రెడీగా ఉండటంతో మంచి దర్శకుడి కోసం ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు ఎదురు చూస్తున్నారు అని కోలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లను బ్యాలన్స్ చేస్తూ దర్శకత్వం చేయగల సత్తా ఉన్న దర్శకుడిని మాత్రం నిర్మాణ సంస్థ కనుకోవడంలో విఫలం అవుతుంది.

సుందర్‌ సి దర్శకత్వంలో రజనీకాంత్‌, కమల్‌ మూవీ...

కొన్ని రోజుల క్రితం రజనీకాంత్‌, కమల్‌ హాసన్ సినిమాకు సుందర్‌ సి దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రజనీకాంత్‌ హీరోగా కమల్‌ హాసన్ నిర్మాణంలో సుందర్‌ సి దర్శకత్వంలో సినిమా అంటూ తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. సుందర్‌ సి ఈ మధ్య కాలంలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అందుకే ఈ సినిమాతో అతడు కచ్చితంగా ఇద్దరు సూపర్ స్టార్స్ ఫ్యాన్స్‌ ను మెప్పిస్తాడని అనుకున్నారు. అయితే సినిమా ప్రకటన వచ్చిన రెండు మూడు రోజుల్లోనే దర్శకుడు సుందర్‌ సి తాను ఆ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించబోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. మీడియాలో వచ్చిన వార్తల విషయమై ఆయన స్పందించేందుకు నిరాకరించాడు. అయితే ఆయన భార్య అయిన సీనియర్‌ హీరోయిన్‌ ఖుష్బూ మీడియాలో పుకార్లకు, వార్తలకు కాస్త ఘాటుగానే స్పందించింది.

ఖుష్బూ ఐటెం సాంగ్‌ అసలు విషయం...

మొదట రజనీ, కమల్‌ కాంబో మూవీలో ఖుష్బు తో ఐటెం సాంగ్‌ చేయించాలనే చర్చలు జరిగాయని, అయితే దర్శకుడ సుందర్‌ సి తన భార్యతో ఐటెం సాంగ్‌ చేయించేందుకు తిరస్కరించడం వల్లే ఆయన్ను ప్రాజెక్ట్‌ నుంచి తప్పించారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లకు సుందర్‌ సి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఖుష్బూ కాస్త ఘాటుగా స్పందించింది. మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అసలు ఆ సినిమాలో నన్ను ఐటెం సాంగ్‌ చేయమని ఎవరూ అడగలేదు. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరిని అయినా సినిమా కోసం ఐటెం సాంగ్‌ చేయమని అడిగి ఉంటారు అంటూ కౌంటర్‌ ఇచ్చింది. ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సబబు కాదని అసహనం వ్యక్తం చేసింది. సినిమా గురించి బయట జరుగుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఖుష్బూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

మైకేల్‌ మదన కామరాజు మూవీ కోసం

రజనీ, కమల్‌ మెచ్చే విధంగా స్క్రిప్ట్‌ ను సుందర్‌ సి రెడీ చేయడంలో విఫలం కావడం వల్లే ఆయనను తప్పించారు అని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిపై కూడా ఖుష్బూ స్పందిస్తూ నిరాధారమైన వార్తలను నమ్మి టైం వేస్ట్‌ చేసుకోవద్దు అంటూ నెటిజన్స్‌ కి సూచించింది. ఇటీవల ఈమె గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలో పాల్గొంది. ఆ సమయంలో ఖుష్బూ మాట్లాడుతూ కమల్‌ తో తన వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్‌ చేసుకుంది. మైకేల్‌ మదన కామ రాజు సినిమా కోసం మొదటి రోజు రెడీ అయ్యి షూటింగ్‌కు వెళ్తే, ఆయన నేచురల్‌ లుక్ ఉండాలని మేకప్‌ మొత్తం కడుక్కుని రమ్మన్నాడు అని గుర్తు చేసుకుంది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఖుష్బకి మంచి స్పందన దక్కింది. అప్పటి నుంచి మరింత స్పీడ్‌గా ఖుష్బూ అప్పట్లో సినిమాలు చేయడం మొదలైంది.

Tags:    

Similar News