రెండు దశాబ్దాల‌కు మ‌రో సంచ‌ల‌న సీక్వెల్!

షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే న‌వంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌న్న‌ది మేక‌ర్స్ ప్లాన్. ద‌ర్శ కుడిగా దిబాక‌ర్ బెన‌న‌ర్జీ కెరీర్ ఈ సినిమాతో మొద‌లైంది.;

Update: 2025-07-27 06:54 GMT

అనుప‌మ్ ఖేర్, బోమ‌న్ ఇరానీ, పర్విన్ దబాస్, వినయ్ పాఠక్, రణవీర్ షోరే, తారా శర్మ ప్ర‌ధాన పాత్ర‌లో దిబాక‌ర్ బెన‌ర్జీ తెర‌కెక్కించిన `ఖోస్లా కా గోస్లా` అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. క‌ష్ట ప‌డి సంపాదించుకున్న స్థ‌లంలో ఇల్లు క‌ట్టుకోవాల‌ని క‌ల‌లు క‌నే ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి ఇతి వృత్తాంతం తో ఎంతో హృద్యంగా తెర‌కెక్కించిన చిత్ర‌మిది. కమల్ కిషోర్ ఖోస్లాగా అనుపమ్ ఖేర్, కిషన్ ఖురానాగా బోమన్ ఇరానీ, చిరౌంజీ లాల్ ఖోస్లాగా పర్విన్ దబాస్, ఆసిఫ్ ఇక్బాల్ గా వినయ్ పాఠక్, బల్వంత్ ఖోస్లాగా రణవీర్ షోరే, మేఘనా చోప్రా పాత్రలో తారా శర్మ ఆద్యంతం మెప్పించారు.

తెర‌పై అద్బుతైన అభిన‌యంతో ప్రేక్ష కుల్ని అల‌రించారు. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అప్ప ట్లో జాతీయ పుర స్కారం ద‌క్కింది. విమ ర్శ‌కులు ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న గొప్ప చిత్రంగా నిలిచింది. తాజాగా రెండు ద‌శాబ్ధాల అనంత‌రం ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతుంది. ఇందులో ఓ ప్ర‌ధాన పాత్ర‌కు హ్యూమా ఖురేషీని ఎంపిక చేసారు. మిగ‌తా పాత్ర‌ల‌కు సంబంధించి ఎంపిక ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రి కొద్ది రోజుల్లోనే ఆ ప‌నులు పూర్తికానున్నాయి.

షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే న‌వంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌న్న‌ది మేక‌ర్స్ ప్లాన్. ద‌ర్శ కుడిగా దిబాక‌ర్ బెన‌న‌ర్జీ కెరీర్ ఈ సినిమాతో మొద‌లైంది. రెండు ద‌శాబ్దాల కెరీర్ లో 11 సినిమాలు మాత్ర మే డైరెక్ట్ చేసారు. `లస్ట్ స్టోరీస్`, `ఘోస్ట్ స్టోరీస్` లాంటి చిత్రాల‌ను దిబాక‌ర్ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది `ల‌వ్ సెక్స్ ఔర్ ధోకా 2`ని తెర‌కెక్కించాడు దిబాక‌ర్. 2010 లో రిలీజ్ అయిన `ల‌వ్ సెక్స్ ఔర్ ధోకా` చిత్రానికి సీక్వెల్ రూపం ఇది. కానీ ఈ సీక్వెల్ పెద్ద‌గా ఆడ‌లేదు.

తాజాగా మ‌రోసారి తొలి సినిమా సీక్వెల్ తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం విశేషం. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వ‌రుస‌గా చాలా హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ తెర‌కెక్కుతున్నాయి. 20, 30 ద‌శాబ్ధాల క్రితం నాటి సినిమాల‌కు సైతం 2025 సీక్వెల్ వేదిగా మారింది. ఈ సినిమాల‌న్నీ వ‌చ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. బాలీవుడ్ త‌ర‌హాలోనే టాలీవుడ్ కూడా సీక్వెల్స్ జోరు ఊపందుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News