• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  KGF 3 స్క్రిప్టు హీరో...

KGF 3 స్క్రిప్టు హీరో రెడీ.. ద‌ర్శ‌కుడెవ‌రంటే

| నేను దర్శకుడనో కాదో నాకు తెలియదు కానీ యష్ ఎప్పుడూ అందులో భాగమవుతాడు.. ఒక సీరియస్ నోట్‌లో KGF 3 సెట్స్ పైకి వెళుతుంది .. కానీ మేం ఇంకా దానిని ప్రకటించలేదు

By - Tupaki Desk
Update: 2023-12-07 18:49 GMT

బాహుబ‌లి ఫ్రాంఛైజీ ఘ‌న‌విజ‌యం త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో చ‌ర్చించుకున్న‌ది కేజీఎఫ్ ఫ్రాంఛైజీ గురించే. అలాంటి గొప్ప ఫ్రాంఛైజీ సృష్ఠిక‌ర్త క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. అత‌డి నోటి నుంచి వెలువ‌డే ప్ర‌తి మాటా ఆణిముత్య‌మే. ఆయ‌న పలుకులు ఆస‌క్తిని పెంచుతాయి. ఇప్పుడు అలాంటి ఆస‌క్తిని క‌లిగించే మ‌రో మంచి మాట చెప్పారు ప్ర‌శాంత్ నీల్

KGF - KGF 2 చిత్రాలు అద్భుతమైన విజయం సాధించిన‌ తర్వాత, ఫ్రాంచైజీలో మూడవ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. రెండవ చిత్రం క్లైమాక్స్ లో మూడో భాగం ఉంటుంద‌ని ప్ర‌శాంత్ నీల్ హింట్ ఇచ్చారు. అయితే పార్ట్ 3 గురించి ఇటీవ‌ల ఆశించిన అప్‌డేట్ రాలేదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ KGF 3 స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, యష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తార‌ని వెల్లడించారు.

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ-``కేజీఎఫ్ 3కి. నేను దర్శకుడనో కాదో నాకు తెలియదు కానీ యష్ ఎప్పుడూ అందులో భాగమవుతాడు.. ఒక సీరియస్ నోట్‌లో KGF 3 సెట్స్ పైకి వెళుతుంది .. కానీ మేం ఇంకా దానిని ప్రకటించలేదు. మా దగ్గర ఇప్పటికే స్క్రిప్ట్ ఉంది. ప్రకటించ‌డానికి ముందే స్క్రిప్ట్‌పై నిర్ణయం తీసుకున్నాం. యష్ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి .. కేవలం వాణిజ్య (వ్యాపార‌) కారణాల దృష్ట్యా విషయాలను బయట పెట్టడు. KGF 2 ముగింపులో అధికారిక ప్రకటన చేయడానికి ముందే మేము క‌చ్చితత్వంతో కాగితంపై విషయాన్ని (క‌థ‌, కంటెంట్ ని) సిద్ధం చేసుకున్నాము..`` అని తెలిపారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో తన మొదటి సినిమాని తెర‌కెక్కించేందుకు నీల్ సిద్ధమవుతున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా గురించి అత‌డు మాట్లాడుతూ.. ``ఈ సినిమాలో విభిన్నమైన భావోద్వేగాలను ప్ర‌జ‌లు చూస్తారు. నేను కొత్త‌ జానర్‌లోకి వెళ్లాలని అనుకోను. కానీ నాకు తెలుసు.. ప్రజలు దీనిని యాక్షన్ చిత్రంగా భావిస్తారు. నేను నా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను.. ఇది నాకు చాలా కొత్త కథ అని బిగ్గ‌ర‌గా చెప్పాల‌నుకుంటున్నాను. ఈ క‌థ‌ స్వ‌యం ప్ర‌కాశ‌క భావోద్వేగాన్ని కలిగి ఉంది. ప్రజలు దానితో సంబంధం కలిగి ఉంటారని నేను ఆశిస్తున్నాను`` అని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ఇది యాక్ష‌న్ సినిమానే అయినా కానీ సినిమా ఆద్యంతం భావోద్వేగాల‌తో ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని ప్ర‌శాంత్ నీల్ హామీ ఇచ్చారు.

ప్ర‌శాంత్ నీల్ ఇంకా చాలా విష‌యాలు ముచ్చ‌టించారు. `స‌లార్ తర్వాత నా తదుపరి చిత్రాన్ని 2024 రెండవ భాగంలో ప్రారంభిస్తాను`` అని నీల్ చెప్పాడు. ఏ హీరోతో పని చేయాలనుకుంటున్నారు? అని ప్ర‌శ్నిస్తే.. ఇంకా ఎవరితో కలిసి పనిచేయడం లేదు అని కూడా చెప్పాడు. అంటే ఎన్టీఆర్ తో కానీ, య‌ష్ తో కానీ అత‌డు ఇంకా పూర్తిగా ఇంట‌రాక్ట్ కాలేదు. పూర్తి బౌండ్ స్క్రిప్టును లాక్ చేయ‌లేద‌ని దీన‌ర్థం. అమితాబ్ పై త‌న అభిమానాన్ని ప్ర‌శాంత్ నీల్ దాచుకోలేదు. ``నేను అమితాబ్ బచ్చన్ సినిమాలు చూసి పెరిగాను. నేను నా ఫేవ‌రెట్ స్టార్ ను దర్శకత్వం వహించాలనుకుంటున్నాను. కానీ.. నా సినిమాలో నటించేందుకు ఆయన అంగీకరించాలి!`` అని కూడా ప్రశాంత్ నీల్ అన్నారు.

Tags:    
  • Kgf3 
  • Yashraj 
  • Prashanthneel 
  • Ntr 

Similar News

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS